Numerology: మీ ఫోన్ నెంబర్ మీకు లక్కీ నంబరేనా? తెలుసుకోండిలా..
న్యూమరాలజీ(Numerology) అనేది నిర్ణీత సంఖ్యల ఆధారంగా వ్యక్తుల గుణగణాలు, లక్షణాలను విశ్లేషించే శాస్త్రం. దీని ప్రకారం కొన్ని మొబైల్ నంబర్‌లను చాలా శుభప్రదంగానూ, మరికొన్నింటిని అశుభప్రదంగా పరిగణిస్తారు. మరీ మీ మొబైల్ మీకు లక్కీ నెంబరేనా? తెలుసుకోండిలా
- FB
- TW
- Linkdin
Follow Us

జీవితంపై సంఖ్యల ప్రభావం
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే, సంఖ్యాశాస్త్రం ప్రకారం, మీ మొబైల్ నంబర్‌లోని సంఖ్యలు మీ జీవితం, ఆర్థిక స్థితి, సంబంధాలు, అదృష్టంపై ప్రభావం చూపుతాయి. ప్రతి అంకెకి ప్రత్యేక శక్తి ఉండటంతో, సరైన నంబర్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావచ్చని భావిస్తారు.
అదృష్ట సంఖ్య ఎలా తెలుసుకోాలి?
మీ లక్కీ నెంబర్ ను కనుగొనడానికి మీ మొబైల్ నంబర్‌లోని అన్ని అంకెలను జోడించండి. మొత్తం 1 అంకె వచ్చే వరకు కలిపేయాలి. ఈ సంఖ్యనే అంకమూలం అంటారు. తర్వాత ఈ సంఖ్యను మీ జన్మతేది ఆధారంగా లెక్కించే మూల సంఖ్యతో సరిపోల్చండి. సరిపోతే ఆ నంబర్ మీకు శుభదాయకం.
మూల సంఖ్య ఎలా కనుగొనాలి?
మీ పుట్టిన తేదీలోని అంకెలను కలపండి. ఉదాహరణకు మీరు 14వ తేదీన పుట్టుంటే.. 1 + 4 = 5 అంటే మీ మూల సంఖ్య = 5 . ఈ మూల సంఖ్యతో మీ మొబైల్ అదృష్ట సంఖ్యను సరిపోల్చి శుభఫలితాలను అంచనా వేయవచ్చు.
సరిపోల్చడం ఎందుకు?
మీ మొబైల్ నంబర్ నుండి లభించిన అదృష్ట సంఖ్య( అంకమూలం)ను, మీ పుట్టిన తేదీ నుండి వచ్చిన మూల సంఖ్యతో పోల్చండి. ఈ రెండు సంఖ్యలు ఒకేలా ఉంటే ఆ మొబైల్ నంబర్ మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇది శుభప్రదమైన సంకేతం.
లెక్కించడం ఎలా?
ఉదాహరణకు మొబైల్ నంబర్: 9891004444 అయితే.. 9 + 8 + 9 + 1 + 0 + 0 + 4 + 4 + 4 + 4 = 45, 4 + 5 = 9 దీని ప్రకారం ఈ మొబైల్ నంబర్‌కి అదృష్ట సంఖ్య = 9
ఇక మీ పుట్టిన తేదీ ఉదాహరణకు 18 అయితే.. 1 + 8 = 9 అంటే మీ మూల సంఖ్య కూడా 9. ఈ రెండు సంఖ్యలు ఒకేలా ఉన్నందున, ఈ మొబైల్ నంబర్ మీకు అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తారు.
శుభ సంఖ్యలు, అశుభ సంఖ్యలు
సంఖ్యాశాస్త్రం ప్రకారం : శుభ సంఖ్యలు: 1, 3, 5, 7, 9, అశుభ సంఖ్యలు: 2, 4, 6, 8 జీవితంలో అడ్డంకులు, విఘ్నాలు రావద్దనుకుంటే, మీ మొబైల్ నంబర్ చివరి అంకెగా 4 లేదా 8 ఉండకూడదు. ఇవి అశుభంగా పరిగణించబడతాయి. శుభ అంకెలతో ముగియే నంబర్‌ను ఎంచుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావిస్తారు.