MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బులే.. డబ్బులు!

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి డబ్బులే.. డబ్బులు!

Numerology: జ్యోతిషశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా ఏర్పడిన జనన సంఖ్య ఆ వ్యక్తి వ్యక్తిత్వం గురించి అనేక విషయాలు చెబుతుంది. అదే సమయంలో, కొన్ని జనన సంఖ్యలను సంఖ్యాశాస్త్రంలో చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఏ రోజు, ఏ జన్మ నక్షత్రం కింద పుట్టినవారు అదృష్టవంతులో ఇప్పుడు తెలుసుకుందాం. 

3 Min read
Bala Raju Telika
Published : Apr 26 2025, 06:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

నంబర్ 1న పుట్టిన వారు సంపద, గుర్తింపు త్వరగా పొందుతారు. ఇక నంబర్ 2 వ్యక్తులు విజయం సాధిస్తారు. నంబర్ 3 వ్యక్తులు అకస్మాత్తుగా కొంత డబ్బు సంపాదించవచ్చు. నంబర్ 4 వ్యక్తులు అనవసరమైన వాదనలలోకి దిగకూడదు. నంబర్ 5 వ్యక్తులు రోజంతా అలసిపోయి, విశ్రాంతి లేకుండా ఉంటారు.

210

6వ సంఖ్య వ్యక్తుల షార్ప్‌గా ఆలోచిస్తుంటారు. వ్యాపార సమస్యలను సులభంగా అధిగమింస్తుంటారు. 7వ సంఖ్యలో పుట్టిన వారు ముఖ్యమైన వ్యక్తులను సంప్రదిస్తారు. 8వ సంఖ్య వ్యక్తులు సరైన వ్యక్తి కాని వ్యక్తి వైపు ఆకర్షితులవుతారు. 9వ సంఖ్య వ్యక్తులకు అధిక ఖర్చులు ఉంటాయి, ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు లభించవు. మిగిలిన తేదీల గురించి ఇప్పుడు చూద్దాం.. 

310

సంఖ్య 1 (ఏ నెలలోనైనా 1, 10, 19 మరియు 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీ తోబుట్టువులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు. మీరు మానసికంగా, శారీరకంగా పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా కాలం పాటు ఆందోళన, మీ చుట్టూ గందరగోళ వాతావరణం తర్వాత మీరు ప్రకాశవంతంగా,  శక్తివంతంగా తయారవుతారు. అప్పటి నుంచి మీరు ఎదుటి వారికి ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుంచి డబ్బు, గుర్తింపుకు లభిస్తాయి. మీ ప్రేమను అన్నివిధాలుగా చూపాలి, మీ ప్రేమాభిమానాలు పరస్పరం పొందడానికి ప్రయత్నం చేయండి. మీ అదృష్ట సంఖ్య 9, మరియు మీ అదృష్ట రంగు ఎరుపు.

410

సంఖ్య 2 (ఏ నెలలోనైనా 2, 11, 20 లేదా 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

ధార్మిక సంస్థకు ఉదారంగా విరాళం ఇవ్వడానికి ఇది మంచి సమయం. మీరు సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మీ అద్భుతమైన ఆరోగ్యం కారణంగా మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీరు కృషి ఫలితంగా విజయం సాధిస్తారు. మిమ్మల్ని నవ్వించే వ్యక్తిని మీరు కలుస్తారు. మీ అదృష్ట సంఖ్య 22, అదృష్ట రంగు ముదురు బూడిద రంగు.

510
2025 Numerlology

2025 Numerlology

సంఖ్య 3 (ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. నో చెప్పడం మీకు కష్టంగా ఉంటుంది. దూరం నుండి సుభవార్తలు వింటారు. తలనొప్పి, జ్వరం వంటి భావన రోజంతా కొనసాగవచ్చు. అకస్మాత్తుగా వచ్చే ఊహించని ఫలితం మీ కష్టాలను తొలగిస్తుంది. మీరు ఓ సందర్భంలో ప్రత్యేకమైన వ్యక్తిని కలవవచ్చు. మీ అదృష్ట సంఖ్య 1, రంగు నారింజ.

610

సంఖ్య 4 (ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీకు సమీప భవిష్యత్తులో గుర్తింపు వస్తుంది. మీరు ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు. అనవసరమైన వాదనలకు వెళ్లవద్దు. అనుకున్న పని ఆలస్యం, నిరాశ ఎదురుకావడం వల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు. మీకు మీ భావాల గురించి ఖచ్చితంగా తెలియని వ్యక్తిని మీరు కలుస్తారు. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు నారింజ.

710

సంఖ్య 5 ( ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా రాణిస్తారు. పని ఒత్తిడి వల్ల రోజంతా అలసటగా, విశ్రాంతి లేకుండా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కుటుంబ సభ్యులు మీకు సాయం చేస్తారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తాడు, లేదా ఇప్పటికీ మీరు ఇష్టపడుతున్న వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తారు. మీ అదృష్ట సంఖ్య 17, రంగు ముదురు బూడిద రంగు.

810

సంఖ్య 6 (ఏ నెలలోనైనా 6, 15 లేదా 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే అవకాశం లభిస్తుంది. ఎదుటి వ్యక్తితో వాదనకు దిగకండి. ప్రస్తుతం మీరు గొప్పగా జీవిస్తున్నారు. మీకు ఉన్న చురుకైన తెలివితేటలు వ్యాపార సమస్యలను సులభంగా అధిగమించడంలో సహాయపడతాయి. మీ అదృష్ట సంఖ్య 2 రంగు ఎలక్ట్రిక్ గ్రే.

910

సంఖ్య 7 (ఏ నెలలోనైనా 7, 16 మరియు 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీ ఆప్యాయత వల్ల గతంలో దెబ్బతిన్న రిలేషన్స్‌ మళ్లీ తిరిగి బలంగా ఏర్పడతాయి. మీరు ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చెడుగా చూపించడానికి ఇష్టపడతారు. మీరు ఊహించని చోటు నుంచి డబ్బు సంపాదిస్తారు. ఈ సమయంలో మీ భాగస్వామి ప్రేరణకు మూలం. మీ అదృష్ట సంఖ్య 18, అదృష్ట రంగు రోజీ బ్రౌన్.

8వ సంఖ్య (ఏ నెలలోనైనా 8, 17 మరియు 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

తోబుట్టువుల మధ్య వైరం అకస్మాత్తుగా వస్తుంది.  ఏ విషయంపై అతిగా స్పందించవద్దు. ఎప్పుడూ విలాసవంతమైన జీవితం గడపాలని అనిపిస్తుంది. ఇళ్లు లేదా స్థలం కొనే అవకాశం ఉంది. డబ్బులు ఖర్చైపోతున్నాయని ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ జీవితంలో సరైన భాగస్వామిని ఎంపిక చేసులేకపోవడంతో ఇబ్బందులు వస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. మీ అదృష్ట సంఖ్య 1, రంగు లేత ఎరుపు.

1010

9వ సంఖ్య (ఏ నెలలోనైనా 9, 18 మరియు 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

మీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి సాయం పొందుతారు. మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున.. జాగ్రత్తగా ఉండండి.. ముఖ్యంగా అగ్నికి, పదునైన వస్తువులకు దూరంగా ఉండండి. ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆశించిన ఆర్థిక లాభాలు ఫలించవు. సరదాకు కూడా మీ భాగస్వామిని బెదిరించకండి. కొన్ని విషయాలు పూర్తిగా అదుపు తప్పవచ్చు. మీ అదృష్ట సంఖ్య 5, రంగు టర్కోయిస్.

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
జ్యోతిష్యం
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved