Numerology: ప్రారంభంలో కష్టాలున్నా.. ఈ తేదీల్లో పుట్టినవారికి భవిష్యత్తులో ఢోకా ఉండదట
Numerology: జ్యోతిషశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా జనన సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య ఆధారంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. కొన్ని సంఖ్యల సంఖ్యాశాస్త్రంలో చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఏ రోజు, ఏ జన్మ నక్షత్రం కింద పుట్టినవారు అదృష్టవంతులో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యక్తిత్వంపై ప్రభావం
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వారి మూల సంఖ్యను నిర్ణయిస్తారు. ప్రతి మూల సంఖ్యకు ఒక అధిపతి గ్రహం ఉంటుంది, ఇది వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది.
ప్రతి సంఖ్యకు మంచి, చెడు లక్షణాలు ఉంటాయి. 1 నుండి 9 వరకు మూల సంఖ్యలు ఉంటాయి. కొన్ని తేదీల్లో పుట్టినవారు కష్టాలను ఎదుర్కొంటారు. బాల్యం కష్టాలతో ఎదుర్కొన్న భవిష్యత్తులో ఢోకా ఉండదట.
గురువు ప్రభావం
3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 3. దీని అధిపతి గురువు. విద్య, జ్ఞానం, పిల్లలు, మతపరమైన అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మూల సంఖ్య 3 వారు గురువు ప్రభావంతో ఉంటారు.
ఆర్థిక ఇబ్బందులు
మూల సంఖ్య 3 వారి బాల్యం కష్టాలతో కూడుకున్నది. చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
భవిష్యత్తులో తిరుగు ఉండదు.
బాల్యంలో కష్టాలు పడిన వీరు యవ్వనంలో ఐశ్వర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కష్టపడి సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారు.
సంఖ్యా శాస్త్రం ప్రకారం.. మూల సంఖ్య 3 వారు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎవరి సహాయం ఆశించరు. తమకు నచ్చినట్లు జీవిస్తారు.
బలమైన బంధం
మూల సంఖ్య 3 వారు కుటుంబాన్ని, ముఖ్యంగా తోబుట్టువులను చాలా ప్రేమిస్తారు. వారితో బలమైన బంధం ఉంటుంది. ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటారు.