Amavasaya: అమావాస్య రోజున ఇవి ఇస్తే.. ఎంతటి ఆర్థిక సమస్యలైనా తీరిపోతాయి..!
ఈరోజుల్లో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉంటారు. ఆ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Ashada Amavasya
హిందూ మతంలో అమావాస్య చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా పూర్వీకులను స్మరించుకుంటారు. వారికి శాంతి చేకూర్చడానికి పిండ ప్రదానాలు లాంటివి కూడా చేస్తారు.ముఖ్యంగా ఆషాఢ అమావాస్యకు మరింత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కొందరైతే ఈ అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేసేవారు. పూర్వీకులకు తర్పణం, పిండం చేస్తారు. ఇలా చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుందని, పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు తెస్తుందని నమ్ముతారు. దీనితో పాటు ఆషాఢ అమావాస్య సాయంత్రం రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు తీరిపోతాయి. ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా కచ్చితంగా తీరతాయి. మరి, దాని కోసం మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
అప్పుల బాధ తీరడానికి..
ఈరోజుల్లో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉంటారు. ఆ అప్పుల బాధ నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ, అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం వల్ల కచ్చితంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాదు.. అప్పులు కూడా తీరే అవకాశం ఉంటుంది.
పటిక ఇలా వాడితే..
ఆషాఢ అమావాస్య సాయంత్రం మీ ఇంటి ప్రతిమూలలో, ముఖ్యంగా ప్రతికూల శక్తి ఉండవచ్చు అని మీరు భావించే ప్రదేశంలో ఒక గిన్నెలో కొద్దిగా పటికను ఉంచాలి. దానిని రాత్రంతా అక్కడే ఉంచండి. మరసటి రోజు ఉదయం, ఈ పటికను తీసుకొని ఇంటి బయట ఉన్న కూడలిలో వేయాలి.లేదా నీటిలో కలిపేయవచ్చు. పటిక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మాత్రమే కాదు..పేదరికం మొత్తాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా, సంపద పెరిగేలా చేస్తుంది.
అమావాస్య సాయంత్రం రోజు..
అప్పుల నుండి బయటపడటానికి. మీరు చాలా కాలంగా అప్పుల బాధలో ఉండి, దాని నుండి బయటపడలేకపోతే, ఆషాఢ అమావాస్య రోజున, ఒక గ్లాసు నీరు తీసుకొని దానిలో ఒక పటిక ముక్క ఉంచండి. ఈ గ్లాసును మీ ఇంటి బాత్రూంలో ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచండి. ఈ నీరు, పటికను 24 గంటలు అక్కడే ఉంచండి. మరుసటి రోజు పటికను తీసివేసి, టాయిలెట్‌లో నీటిని ఫ్లష్ చేయండి. ఈ పరిహారాన్ని కొన్ని అమావాస్యల పాటు నిరంతరం చేయడం ద్వారా, క్రమంగా అప్పుల భారం తగ్గడం ప్రారంభమవుతుంది. డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
వ్యాపారంలో అభివృద్ధి పొందాలంటే..
వ్యాపారం , ఉద్యోగంలో పురోగతి సాధించాలన్నా ఈ అమావాస్య మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ వ్యాపారం నెమ్మదిగా ఉంటే లేదా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే, ఆషాఢ అమావాస్య రోజున, ఒక చిన్న పటిక ముక్క, కొన్ని బియ్యం గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టండి. ఈ కట్టను మీ వ్యాపార స్థలంలోని సేఫ్‌లో లేదా మీ పని డెస్క్ డ్రాయర్‌లో ఉంచండి. ఈ కట్ట వ్యాపారంలో లాభానికి , ఉద్యోగంలో ప్రమోషన్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉంచడం వల్ల డబ్బు రాక పెరుగుతుంది. కెరీర్‌లో అడ్డంకులు తొలగిపోతాయి.