Today Rasi Phalalu: ఈ రాశి వారికి శత్రు సమస్యల నుంచి ఉపశమనం, వ్యాపారాల్లో లాభాలు!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 11.05.2025 సోమవారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మేష రాశి
చేపట్టిన పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
వృషభ రాశి
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. అనవసరమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు.
మిథున రాశి
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధన ఆదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.
కర్కాటక రాశి
వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
సింహ రాశి
బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి.
కన్య రాశి
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
తుల రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి
సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు రాశి
సన్నిహితులతో తగాదాలు రావచ్చు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. పిల్లల చదువుకు సంబంధించిన ఫలితాలు వస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలుగుతాయి.
మకర రాశి
రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. బంధువుల నుంచి వినకూడని మాటలు వినాల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల పరిస్థితులుంటాయి.
కుంభ రాశి
కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూలం. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి.
మీన రాశి
అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. రుణ ప్రయత్నాలు కలిసి రావు. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఇంట్లో గందరగోళ వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో అవరోధాలు కలుగుతాయి.