ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 29.04.2025 మంగళవారానికి సంబంధించినవి.
మేష రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. వృత్తి, ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలం అవుతాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వృషభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. అకారణంగా ఇతరులతో విరోధం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో విలువైన వస్తువుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా నష్టాలు తప్పవు.
మిథున రాశి ఫలాలు
తండ్రి తరఫు వారితో మాట పట్టింపులు ఉంటాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. శారీరక, మానసిక సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
కుటుంబం విషయంలో ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అన్నదమ్ములతో బంధాలు మెరుగుపడతాయి.
సింహ రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు కలిసిరావు. డబ్బు పరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది.
కన్య రాశి ఫలాలు
ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు అధిగమించి లాభాల అందుకుంటారు. ఖర్చుకు తగ్గ ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
తుల రాశి ఫలాలు
విదేశీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉండవు.
వృశ్చిక రాశి ఫలాలు
పాత రుణాలు తీరుస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ధన ఆదాయం బాగుంటుంది. ఇతరుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.
ధనస్సు రాశి ఫలాలు
ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగులు లభించిన ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మకర రాశి ఫలాలు
ఇంటి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు వింటారు.
కుంభ రాశి ఫలాలు
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించవు. వృత్తి, ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. శారీరక, మానసిక సమస్యలు మరింత బాధిస్తాయి.
మీన రాశి ఫలాలు
వాహనయోగం ఉంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశంసలు అందుకుంటారు.
