ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 28.04.2025  సోమవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి కీలక సమాచారం అందుతుంది. స్వల్ప ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మిథున రాశి ఫలాలు

కొన్ని పనుల్లో కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగటం మంచిది. ఉద్యోగుకు పని ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధు మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

సింహ రాశి ఫలాలు

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధువులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారాలు లాభదాయకం.

కన్య రాశి ఫలాలు

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఇంటి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూర ప్రాంత సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల సహకారం ఉంటుంది.

తుల రాశి ఫలాలు

స్థిరాస్తి వ్యవహారంలో బంధువుల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భూ క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

వృశ్చిక రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి ఊహించని సహకారం అందుతుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉంటాయి.

ధనస్సు రాశి ఫలాలు

కుటుంబ సభ్యులకు మీ ప్రవర్తన నచ్చదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో అవరోధాలను అధిగమిస్తారు.

మకర రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాలు తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. బంధు మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.

కుంభ రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసివస్తాయి. పిల్లలకు సంబంధించిన విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మీన రాశి ఫలాలు

కొన్ని సమస్యల నుంచి సోదరుల సహాయంతో బయటపడతారు. క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.