Today Rasi Phalalu: ఈ రాశులవారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు.. నిరుద్యోగులకు ఉద్యోగం!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 5.07.2025 శనివారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మేష రాశి ఫలాలు
వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అంతగా కలిసిరావు. ఆర్థిక వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు.
వృషభ రాశి ఫలాలు
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
మిథున రాశి ఫలాలు
పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
సింహ రాశి ఫలాలు
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో సమస్యలు రావచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
కన్య రాశి ఫలాలు
సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పిల్లల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. కొన్ని విషయాల్లో బంధు మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.
తుల రాశి ఫలాలు
ఉద్యోగంలో అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
వృశ్చిక రాశి ఫలాలు
చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ధనుస్సు రాశి ఫలాలు
పిల్లల చదువు విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులను అదుపు చేయడం కష్టమవుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి ఫలాలు
జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి సన్నిహితుల సహకారం అందుతుంది. పిల్లల చదువు విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లను అధిగమిస్తారు. వ్యాపారాల్లో శత్రు సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.
మీన రాశి ఫలాలు
నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.