Today Rasi Phalalu: ఈ రాశి వారు జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 04.06.2025 బుధవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పట్టుదలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు తొలగిపోతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. స్వల్ప ధన లాభం ఉంది. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.
వృషభ రాశి ఫలాలు
ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తికావు. అవసరానికి చేతిలో ఉబ్బు ఉండదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు.
మిథున రాశి ఫలాలు
కొత్త వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలం. అప్పులు తీరుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో సాలరీ విషయంలో శుభవార్తలు వింటారు.
సింహ రాశి ఫలాలు
ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
కన్య రాశి ఫలాలు
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో చర్చలు అనుకూలిస్తాయి. స్థిరాస్థి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటి నిర్మాణ పనులు మొదలు పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి.
వృశ్చిక రాశి ఫలాలు
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు మెరుగైన పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
మకర రాశి ఫలాలు
భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి. భూ క్రయ విక్రయాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ చర్చల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కుంభ రాశి ఫలాలు
స్వల్ప ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలు సాధారణం. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
మీన రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు.