సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారట. అదృష్టం వీరి వెంటే ఉంటుందట. వారెప్పుడు రాజులాగే జీవిస్తారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారికి రాజయోగం ఉంటుందో ఇక్కడ చూద్దాం.
సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. సంఖ్యా శాస్త్రం ఆధారంగా వ్యక్తుల భవిష్యత్ గురించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19 లేదా 28 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. మూల సంఖ్య 1 కలిగిన వారి వ్యక్తిత్వం, అదృష్టం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
మూల సంఖ్య 1 కలిగిన వ్యక్తులపై దైవ అనుగ్రహం ఎక్కువ!
సంఖ్యా శాస్త్రం ప్రకారం జన్మ సంఖ్య 1 కలిగివారిపై దైవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుందట. దైవం వీరి చుట్టూ రక్షణగా ఉంటుందని నమ్ముతారు. అదృష్టం కూడా ఎప్పుడూ వీరి వెంటే ఉంటుందట.
ఆత్మవిశ్వాసం..
ఈ తేదీల్లో పుట్టిన వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరి సొంతం. ఇతరులకు మంచి సలహాలు ఇస్తుంటారు. ఈ లక్షణాల కారణంగా సమాజంలో మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందుతారు.
రాజయోగం..
సూర్యుడిని రాజుకి ప్రతీకగా భావిస్తారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, గౌరవం, విజయం ఇవన్నీ సూర్యుడి ప్రభావంతో వస్తాయి. అందుకే 1 ని రాజయోగ సంఖ్యగా చెప్తారు. ఈ తేదీల్లో పుట్టినవారు రాజు లాగా జీవిస్తారని నమ్ముతారు.
అదృష్టవంతులు
సంఖ్యా శాస్త్రం ప్రకారం మూల సంఖ్య 1 కలిగిన ఆడపిల్లలు చాలా అదృష్టవంతులు. ఈ తేదీల్లో పుట్టిన వారు కోరుకున్నవన్నీ పొందుతారు.
రాజయోగ సంకేతాలు
జన్మ సంఖ్య 1 కలిగినవారి జాతకంలో ఉన్నత స్థానం, ఏ పనిలో అయినా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా కష్టపడితే చాలు.. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
ఏ రంగాల్లో రాణిస్తారు?
ఈ తేదీల్లో జన్మించిన వారు పరిపాలన, సైన్యం, రాజకీయాలు, వ్యాపారం, రచన తదితర రంగాల్లో రాణిస్తారు.
గొప్ప ఆలోచనాపరులు
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ప్రత్యేక గుణాలను కలిగి ఉంటారు. పెద్ద కలలు, దార్శనికత, ధైర్యం వీరిని ప్రత్యేకంగా నిలుపుతాయి.