Today Rasi Phalalu: ఈ రాశివారికి అన్నదమ్ములతో ఆస్తి గొడవలు తప్పవు!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 3.07.2025 గురువారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారాల్లో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగంలో అధికారుల సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
ఆర్థిక వాతావరణం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగంలో ఇతరుల నుంచి విమర్శలు తప్పవు. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
మిథున రాశి ఫలాలు
విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. పిల్లల చదువు విషయాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.
కర్కాటక రాశి ఫలాలు
అన్నదమ్ములతో ఆస్థి వివాదాలు వస్తాయి. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది.
సింహ రాశి ఫలాలు
ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు.
కన్య రాశి ఫలాలు
రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది.
తుల రాశి ఫలాలు
కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం అందుతుంది. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉండదు. నిరుద్యోగులు.. అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు రాశి ఫలాలు
భూ సంబంధిత వివాదాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాల్లో ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి ఫలాలు
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి ఫలాలు
పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వృథా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో ఇతరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.
మీన రాశి ఫలాలు
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం.