Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందుతారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 26.02.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ప్రయాణాలు శ్రమతో కూడుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నిరాశ తప్పదు. దైవ భక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. డబ్బు విషయాల్లో కొన్ని నిర్ణయాలు కలిసివస్తాయి.
వృషభ రాశి ఫలాలు
సమాజంలో విశేషమైన ఆదరణ ఉంటుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మిథున రాశి ఫలాలు
ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిలవదు. వృథా ఖర్చులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
ఒక విషయం గురించి పెద్దవాళ్లతో చర్చిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
సింహ రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆర్థిక లాభాలు ఉంటాయి.
కన్య రాశి ఫలాలు
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.
తుల రాశి ఫలాలు
మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు వస్తాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి.
వృశ్చిక రాశి ఫలాలు
కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.
ధనుస్సు రాశి ఫలాలు
భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది.పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
మకర రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపేస్తారు. బంధు మిత్రులతో అకారణంగా కలహాలు వస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో కొంత అస్తవ్యస్త పరిస్థితి ఉంటుంది.
కుంభ రాశి ఫలాలు
స్నేహితులతో అకారణంగా కలహాలు వస్తాయి. పిల్లల చదువుకు సంబంధించిన విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్య వ్యాపారాల్లో నిరాశ తప్పదు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
మీన రాశి ఫలాలు
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు తొలగుతాయి. నూతన వ్యాపారాల్లో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

