Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి సలహా బాగా కలిసివస్తుంది!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 26.04.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి స్థిరాస్తి లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయంతో పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి.
వృషభ రాశి ఫలాలు
వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన కలుగుతుంది.
మిథున రాశి ఫలాలు
కొన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారాలు లాభదాయకం. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగాలలో తోటివారితో సఖ్యత కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
సింహ రాశి ఫలాలు
ఆదాయం బాగుంటుంది. దూర ప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.
కన్య రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. భూ క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
తుల రాశి ఫలాలు
ఉద్యోగాలలో ఆశించిన ట్రాన్స్ ఫర్ లు ఉంటాయి. వ్యాపారాలలో అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. దూర ప్రాంత బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.
వృశ్చిక రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
మకర రాశి ఫలాలు
ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహా కలిసివస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.
కుంభ రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంతాన విద్య, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మీన రాశి ఫలాలు
ఇంటి పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆలోచనలు కలిసివస్తాయి. ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

