MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్‌లో టాప్.. వీళ్లను ఎవరూ ఆపలేరు!

Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్‌లో టాప్.. వీళ్లను ఎవరూ ఆపలేరు!

ప్రతి వ్యక్తి జీవితంలో కెరీర్ చాలా ముఖ్యమైన అంశం. ఎవరు ఏ రంగంలో రాణిస్తారు? ఎలాంటి అవకాశాలు వస్తాయో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్ లో టాప్‍లో ఉంటారు. ఆ నక్షత్రాలేవో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 25 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెరీర్ లో టాప్ లో ఉండే జన్మ నక్షత్రాలు
Image Credit : stockPhoto

కెరీర్ లో టాప్ లో ఉండే జన్మ నక్షత్రాలు

కెరీర్‌లో విజయం సాధించడం ప్రతి ఒక్కరి కల. అయితే కొందరు సహజంగానే ముందుకు దూసుకెళ్తారు. మరికొందరు జన్మ తేదీ, నక్షత్రం వల్ల కెరీర్ లో వృద్ధి సాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం వ్యక్తి స్వభావం, ఆలోచన విధానం, నిర్ణయ సామర్థ్యంపై మాత్రమే కాదు, అతని కెరీర్ దిశపైనా ప్రభావం చూపుతుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు, తెలివితేటలు, పట్టుదల ఎక్కువగా ఉండి, వారు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ నక్షత్రాలు ఏంటి? వాటిలో ఉన్న ప్రత్యేక లక్షణాలు ఎలా విజయానికి దారి తీస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మృగశిర నక్షత్రం
Image Credit : Getty

మృగశిర నక్షత్రం

మృగశిర నక్షత్రంలో పుట్టినవారికి సాధారణంగా జిజ్ఞాస ఎక్కువ. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఈ లక్షణం వారిని రీసెర్చ్, టెక్నాలజీ, సైన్స్ వంటి రంగాల్లో ముందుకు తీసుకువెళ్తుంది. సమస్యలను లోతుగా విశ్లేషించే స్వభావం ఉండటం వల్ల వీరు తమ రంగాల్లో నిపుణులుగా ఎదుగుతారు.

అలాగే చిత్త నక్షత్రంలో జన్మించిన వారు సృజనాత్మకత, క్రమశిక్షణ కలయికతో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. డిజైన్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, మీడియా రంగాల్లో వీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!
Related image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు బయటకు చాలా స్వీట్‍గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వేరు!
35
శ్రవణ నక్షత్రం
Image Credit : Getty

శ్రవణ నక్షత్రం

శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు వినడం, అర్థం చేసుకోవడం, ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవడంలో ముందుంటారు. ఈ నైపుణ్యాలు వీరికి మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, టీచింగ్ వంటి రంగాల్లో విజయాన్ని అందిస్తాయి. ఒకసారి లక్ష్యం నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు కృషి చేయడం వీరి ప్రత్యేకత.

45
ఉత్తర ఫాల్గుణి నక్షత్రం
Image Credit : Getty

ఉత్తర ఫాల్గుణి నక్షత్రం

ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో జన్మించినవారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. టీమ్‌ను నడిపించడం, బాధ్యతలు స్వీకరించడం, పెద్ద నిర్ణయాలు తీసుకోవడం వీరికి చాలా ఈజీ. అందువల్ల కార్పొరేట్, పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో వీరు టాప్ పొజిషన్లకు చేరుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

55
ధనిష్ట నక్షత్రం
Image Credit : Asianet News

ధనిష్ట నక్షత్రం

ధనిష్ట నక్షత్రం వారు ధైర్యం, శ్రమ, క్షమశిక్షణ వంటి లక్షణాలతో కెరీర్‌లో ముందుంటారు. వీరు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడరు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అందువల్ల బిజినెస్, ఫైనాన్స్, స్పోర్ట్స్ వంటి పోటీ రంగాల్లో వీరు మంచి స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువ. పండితుల ప్రకారం ఈ నక్షత్రం వారికి శని, మంగళ గ్రహాల అనుకూలత ఉండటం వల్ల కాస్త కష్టపడి పనిచేసినా పెద్ద విజయాలు సాధిస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vipareeta Rajyogam: విపరీత రాజయోగంతో ఈ 4 రాశులవారి జాతకం మారడం పక్కా.. అదృష్టం మొత్తం వీరిదే!
Recommended image2
Numerology: చిన్న వయసులోనే సొంత ఇల్లు, కారు కొనే అదృష్టం ఈ 4 తేదీల్లో పుట్టిన వారిదే
Recommended image3
Ketu Sanchar: దుష్ట గ్రహ నక్షత్ర మార్పు.. జూన్ నెలాఖరు తర్వాత ఈ 4 రాశుల తలరాతే మారిపోతుంది
Related Stories
Recommended image1
Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!
Recommended image2
Zodiac Signs: ఈ 4 రాశులవారు బయటకు చాలా స్వీట్‍గా కనిపిస్తారు.. కానీ లోపల మాత్రం వేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved