Today Rasi Phalalu: ఈ రాశివారు విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 22.07.2025 మంగళవారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us

మేష రాశి ఫలాలు
ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగుల వల్ల ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల ప్రశాంతత కరవవుతుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
వృషభ రాశి ఫలాలు
సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి.
మిథున రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో వ్యయప్రయాసలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
కర్కాటక రాశి ఫలాలు
ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అంచనాలు నిజం అవుతాయి.
సింహ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
కన్య రాశి ఫలాలు
ప్రయాణాల్లో శ్రమ అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాల్లో చికాకులు అధికమవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
తుల రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వల్ల విశ్రాంతి ఉండదు.
వృశ్చిక రాశి ఫలాలు
దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల నుంచి అవసరానికి డబ్బు లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
మకర రాశి ఫలాలు
ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.
కుంభ రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది.
మీన రాశి ఫలాలు
పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు.