Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 21.03.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుంచి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మిథున రాశి ఫలాలు
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పని భారం వల్ల విశ్రాంతి ఉండదు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు సాధిస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక విషయాల్లో ఆప్తులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్న లోపం వల్ల వచ్చిన అవకాశాలు చేజారుతాయి. డబ్బు విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
సింహ రాశి ఫలాలు
నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.
కన్య రాశి ఫలాలు
ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి , ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
తుల రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలు ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో విఫలమవుతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుంచి బయటపడతారు.
మకర రాశి ఫలాలు
వ్యాపారాలు మరింత మందగిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు.
కుంభ రాశి ఫలాలు
ఇంటా బయటా కీలక నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకొని బాధపడతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీన రాశి ఫలాలు
వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. సన్నిహితుల నుంచి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

