- Home
- Astrology
- Kaala Sarpa Yogam: కాల సర్పయోగం వల్ల 14 రోజుల పాటు ఈ 3 రాశుల వారికి విపరీతమైన టెన్షన్లు
Kaala Sarpa Yogam: కాల సర్పయోగం వల్ల 14 రోజుల పాటు ఈ 3 రాశుల వారికి విపరీతమైన టెన్షన్లు
Kaala Sarpa Yogam: దశాబ్దాల తర్వాత కాలసర్ప యోగం ఏర్పడింది. రాహు కేతువుల మధ్య అన్ని గ్రహాలు చిక్కుకుపోతే ఈ యోగం వస్తుంది. రాబోయే 14 రోజుల పాటు 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి అనేక రకాల ఇబ్బందులు తప్పకపోవచ్చు.

కాలసర్పయోగం మొదలైంది
జూన్ 6, శనివారం సాయంత్రం 7:03 గంటలకు చంద్రుడు కుంభరాశిలో అడుగుపెట్టాడు. ఈ సంచారం వల్ల ప్రమాదకరమైన కాలసర్ప యోగం ఏర్పడింది. ఈ యోగం జూన్ 21 వరకు ఉంటుంది. రాహు కేతు గ్రహాల మధ్య మిగతా గ్రహాలన్నీ చిక్కుకున్నప్పుడు కాలసర్ప యోగం ఏర్పడుతుంది. జూన్ 7న చంద్రుడు కుంభరాశిలోకి రావడంతో అన్ని గ్రహాలు రాహు కేతువుల మధ్యకు వచ్చేశాయి. ఈ యోగం ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల తీవ్రమైన గొడవలు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో అడ్డంకులు, అనేక రకాల సమస్యలు రావచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు జూన్ 21 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నచిన్న విషయాలకు ఏమాత్రం స్పందించకూడదు. బ్యాంకు ఖాతాలు, చెల్లింపుల విషయంలో అనేక సమస్యలు రావచ్చు. డబ్బు విషయంలో బంధువులతో గొడవలు కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోర్టు కేసుల్లో ఉన్నవారికి ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, పెద్ద నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం ఉంది. వీరు శివ మంత్రాలు జపిస్తే మంచిది. అవసరంలో ఉన్న పేదలకు మందులు దానం చేస్తే కొంత ఉపశమనం దక్కుతుంది.
కుంభ రాశి
కాలసర్ప యోగం ప్రభావం వల్ల కుంభ రాశి వారికి జూన్ 21 వరకు మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. ఆఫీసులో అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగిపోతోంది. ఇక ఆన్‌లైన్ వ్యాపారం చేస్తున్నవారికి రిటర్న్స్, ఫిర్యాదులు ఎక్కువైపోతాయి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలు తలనొప్పిగా మారుతాయి. విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినొచ్చు. బంధువులతో మాటలు తగ్గుతాయి. దీని వల్ల దూరం పెరిగిపోతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి వ్యతిరేకత ఎదురవుతుంది. లోన్ వాయిదాలు చెల్లించలేక ఒత్తిడికి గురవుతారు. కుటుంబ సమస్యలు మీ నిద్రను పాడుచేస్తాయి. వీరు శని దేవుడికి నువ్వులు దానం చేస్తే ఉపశమనం ఉంటుంది. అవసరంలో ఉన్న పేద కార్మికులకు సహాయం చేయండి.
సింహ రాశి
సింహ రాశి వారికి కాల సర్పయోగంతో ఎన్నో సమస్యలు వస్తాయి. కోపానికి, అసహనానికి గురవుతూ ఉంటారు. ప్రభుత్వ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారిని వారి భాగస్వాములు మోసం చేసే అవకాశం ఉంది. చిన్న పొరపాటు పెద్ద వాదనకు దారితీస్తుంది. మాటల వల్ల కుటుంబంలో గొడవలు పెరగవచ్చు. పెళ్లి ఆలస్యం కావచ్చు. చట్టపరమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వీరిలో అలసట, చిరాకు పెరుగుతాయి. పరిహారం కోసం సూర్య భగవానుడిని పూజించాలి. వృద్ధులకు సేవ చేస్తే మంచిది.

