MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది.. మీది ఏ రాశి?

Today Rasi Phalalu: నేడు ఈ రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది.. మీది ఏ రాశి?

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 11.04.2026 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 11 2026, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.

Related Articles

Related image1
Venus Transit: మృగశిర నక్షత్రంలో శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!
Related image2
Ashtama Shani Effects: అష్టమ శని అంటే ఏంటి? ప్రస్తుతం దాని ప్రభావం ఏ రాశులపై ఉంది?
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు అమచేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల వల్ల చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఇంటా బయటా అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఉద్యోగాలలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది
Recommended image2
Dream: ఇలాంటి కలలు ఎవరికీ చెప్పొద్దు.. ఎవరికైనా చెప్పారో.. ఇక అంతే..!
Recommended image3
Budha Gochar: మేషంలో బుధాదిత్య రాజయోగం.. ఈ 5 రాశులకు కోరుకున్న జీవితం
Related Stories
Recommended image1
Venus Transit: మృగశిర నక్షత్రంలో శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!
Recommended image2
Ashtama Shani Effects: అష్టమ శని అంటే ఏంటి? ప్రస్తుతం దాని ప్రభావం ఏ రాశులపై ఉంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved