పంచముఖి ఆంజనేయ విగ్రహం శక్తివంతమైనది కాబట్టి, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. ఇంట్లో ఉంచితే ఇంటి ప్రశాంతత దెబ్బతింటుంది.
రొమ్ము చీల్చుకుంటున్న హనుమంతుడి బొమ్మను ఇంట్లో పెడితే ఇంట్లో ప్రశాంతత ఉండదు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇలాంటి బొమ్మను ఇంట్లో పెడితే మనశ్శాంతి ఉండదు, చేసే పనుల్లో ఆటంకం ఏర్పడుతుంది.
హనుమంతుడి ఉగ్రరూపంలో ఉన్న బొమ్మను ఇంట్లో పెడితే హింస, ఉద్రిక్తత, గొడవలు, తగాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రాముడు, లక్ష్మణులను మోస్తున్న హనుమంతుడి బొమ్మ ఉత్సాహాన్ని కలిగించినప్పటికీ, దానిని ఇంట్లో పెడితే స్థిరత్వం ఉండదు.
లంకను దహిస్తున్న హనుమంతుడి బొమ్మను ఇంట్లో పెడితే ఆర్థిక నష్టం, తగాదాలు వచ్చే అవకాశం ఉంది.
నోట్: ఈ వివరాలు పలువురు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.