Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామి చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువ!
ప్రేమ, పెళ్లి బంధాలు ముఖ్యమైనవి. సరైన వ్యక్తి మన లైఫ్ లోకి వస్తే సంతోషం రెట్టింపవుతుంది. అదే తప్పుడు వ్యక్తి వస్తే జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. కొన్ని తేదీల్లో పుట్టినవారు లైఫ్ పార్ట్‌నర్ చేతిలో మోసపోయే అవకాశాలు ఎక్కువని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.

Birth Dates according to astrology
జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం జన్మతేది, జన్మ నక్షత్రం, గ్రహస్థితులు.. వ్యక్తి స్వభావం, భావోద్వేగాలు, సంబంధాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టినవారు జీవిత భాగస్వామిని త్వరగా నమ్మడం, త్యాగ స్వభావం ఎక్కువగా ఉండడం వల్ల వారి చేతిల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఆ తేదీలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఏ నెలలో అయినా ఈ తేదీల్లో పుట్టినవారు..
ఏ నెలలో అయినా 2, 6, 7, 11, 15, 20, 24 తేదీల్లో పుట్టినవారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమలో పూర్తిగా లీనమై తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోతారు. వీరు తమ జీవిత భాగస్వామి మాటలను ప్రశ్నించకుండా నమ్మడం, అనుమానం లేకుండా ముందుకు వెళ్లడం వల్ల కొన్ని సందర్భాల్లో మోసానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.
శుక్ర గ్రహ ప్రభావంతో..
ముఖ్యంగా 6, 15 తేదీల్లో పుట్టిన వారిపై శుక్ర గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు అందం, ప్రేమ, సంబంధాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రేమను జీవితంలో అత్యంత ముఖ్యమైందిగా భావిస్తారు. దీనివల్ల, తమ లైఫ్ పార్ట్‌నర్ లోపాలను పట్టించుకోకుండా కేవలం ప్రేమ కోణంలోనే చూస్తారు. ఈ స్వభావం వల్ల కొంతమంది పార్ట్‌నర్లు.. వారి నిజ స్వభావాన్ని దాచిపెట్టి మోసం చేసే పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
చంద్రుడి ప్రభావంతో..
ఏ నెలలో అయినా 2, 11, 20 తేదీల్లో పుట్టినవారు చంద్రుడి ప్రభావంతో సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. చిన్న మాటకే బాధపడే గుణం ఉండటం వల్ల వీరు తమ బాధను బయటపెట్టకుండా మౌనంగా భరిస్తుంటారు. ఒక సమయం తర్వాత సమస్యలు పెరిగి, చివరికి మోసపోయామనే భావన వీరిలో కలుగుతుంది.
7, 24 తేదీల్లో పుట్టినవారు
ఏ నెలలో అయినా 7, 24 తేదీల్లో పుట్టినవారు రహస్య స్వభావం కలిగి ఉంటారు. వీరు తమ భావాలను పూర్తిగా బయటపెట్టరు. అలాగే తమ పార్ట్‌నర్ గురించి లోతుగా తెలుసుకోవడానికి కూడా కొంత ఆలస్యం చేస్తారు. ఈ గుణం వల్ల మొదట్లో కనిపించే మంచితనాన్ని నమ్మి, లోపాలను గమనించరు. అయితే ఇది ప్రతి ఒక్కరికి వర్తించకపోవచ్చు. వ్యక్తిగత జాతకం, దశలు, గ్రహబలం ఆధారంగా ఫలితాలు మారుతాయని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

