MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Head Bath: ఆ రోజుల్లో తల స్నానం చేస్తే.. అన్నీ శుభాలే తెలుసా..?

Head Bath: ఆ రోజుల్లో తల స్నానం చేస్తే.. అన్నీ శుభాలే తెలుసా..?

Head Bath: ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైనా తలస్నానం చేస్తారు. కానీ, తల స్నానం చేసే విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. తల స్నానం ఏ రోజున చేయడం శుభప్రదం.. ఏ రోజున తల స్నానం చేయడం దురదృష్టాన్ని తెస్తుందో తెలుసుకుందాం..

2 Min read
Author : Rajesh K
Published : Jul 24 2025, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆ రోజూ తలస్నానం చేస్తే అన్నీ శుభాలే
Image Credit : our own

ఆ రోజూ తలస్నానం చేస్తే అన్నీ శుభాలే

సాధారణంగా చాలా మంది వారానికి ఒకసారి లేదా రెండుసార్లు తలస్నానం చేస్తారు. అందులోనూ చాలామంది ఆదివారం తలస్నానం చేస్తారు. కానీ,  తలస్నానం వెనుక కూడా శుభ–అశుభాలు ఉంటాయని చెబితే చాలా మందికి ఆశ్చర్యం కలగచ్చు. పంచాంగం ప్రకారం కొన్ని దినాల్లో తలస్నానం చేయకూడదన్న నమ్ముతారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
తలస్నానం ఏ రోజుల్లో చేయాలి ?
Image Credit : our own

తలస్నానం ఏ రోజుల్లో చేయాలి ?

శాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రకారం తలస్నానానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొన్ని రోజులలో తలస్నానం చేయడం శ్రేయస్కరం కాగా, కొన్ని రోజులు తలస్నానం చేయకూడదని చెబుతారు. అలాంటప్పుడు ఏ రోజుల్లో తలస్నానం చేయాలి?  ఏ రోజుల్లో చేయకూడదు? అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం..

37
తలస్నానం చేయడానికి ఏ రోజు మంచిది?
Image Credit : our own

తలస్నానం చేయడానికి ఏ రోజు మంచిది?

సాధారణంగా ఆదివారం సెలవు దినం కావడంతో చాలామంది ఆ రోజున తలస్నానం చేయడం ఆనవాయితీగా మారింది. మహిళలు రుతుక్రమం సమయంలో శరీర శుభ్రత కోసం తలస్నానం చేస్తారు. అలాగే, చాలా మంది పురుషులు రోజూ తలస్నానం చేయడం పరిపాటి.  చాలా చోట్ల ఆడపిల్లలు కూడా ప్రతి రోజూ తలస్నానం చేయడం అలవాటుగా పరిగణించబడుతుంది. ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శుద్ధి, రోజుకు శుభారంభం అన్న భావనతో కూడిన ప్రాచీన సంప్రదాయం. 

47
తలస్నానం ఏ రోజుల్లో చేయకూడదు?
Image Credit : our own

తలస్నానం ఏ రోజుల్లో చేయకూడదు?

తల స్నానం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అంశం అయితేనే గానీ, శాస్త్రాలు, పంచాంగ విశ్వాసాల ప్రకారం కొన్ని ప్రత్యేక దినాల్లో తలస్నానం చేయకూడదని చెప్పడం కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మంగళవారం,  శనివారాల్లో తలస్నానం చేయకూడదని చెబుతారు. ఈ రోజుల్లో తలస్నానం చేయడం వల్ల దినచర్యలో జాప్యం, అలసట, శరీర శక్తి తగ్గిపోవడం, అశుభ ఫలితాలు వస్తాయని విశ్వాసం. 

57
ఆదివారం తలస్నానం... శుభమా? ఆ శుభమా?
Image Credit : our own

ఆదివారం తలస్నానం... శుభమా? ఆ శుభమా?

చాలామందికి ఆదివారం సెలవుదినం కావడం వల్ల ఆ రోజున తలస్నానం చేయడం పరిపాటిగా మారింది. కానీ ధార్మిక గ్రంథాలు, కొన్ని ఆచార శాస్త్రాల ప్రకారం ఆదివారం తలస్నానం చేయడం శుభ ఫలితాలు అందుతాయంట. అయితే కొంతమంది మాత్రం ఆదివారం నాడు తలస్నానం చేస్తే.. శరీర శక్తి తగ్గుతుందని నమ్ముతారు.

అలాగే, గురువారం తలస్నానం చేయకూడదనీ, ఈ రోజు బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తలస్నానం చేస్తే ఆధ్యాత్మిక శక్తి మందగిస్తుందని,  అలాగే అదనపు ఖర్చులు, అనవసరమైన పనుల భారం పెరుగుతుందని కొందరి నమ్మకం.

67
ఈ మూడు రోజుల్లో తలస్నానం చేస్తే..
Image Credit : our own

ఈ మూడు రోజుల్లో తలస్నానం చేస్తే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం, బుధవారం, శుక్రవారం తలస్నానం చేయడం శుభదాయకం. ఈ రోజుల్లో తలస్నానం చేయడం వల్ల సంపద, ఐశ్వర్యం వరిస్తుందని నమ్మకం.  అలాగే.. ఇంటిలో శాంతి, ఆనంద వాతావరణం ఏర్పడుతుందని విశ్వాసం. జీవిత భాగస్వామితో మధురమైన సంబంధం కొనసాగుతుందని శాస్త్రాలు సూచిస్తాయి. 

77
తలస్నానం చేసేటప్పుడు వారాలు గుర్తుపెట్టుకోండి
Image Credit : Google

తలస్నానం చేసేటప్పుడు వారాలు గుర్తుపెట్టుకోండి

ఇకపై  మీరు తలస్నానం చేసే రోజును ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే కొన్ని వారాలలో తలస్నానం చేయడం వల్ల శుభఫలితాలు, అదృష్టం కలిగిస్తుందని, మరికొన్ని వారాలలో చేయడం అశుభం, దురదృష్టానికి కారణమవుతుందని ఆచార శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే.. ఇది కేవలం నమ్మకం మాత్రమే.  

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆరోగ్యం
జ్యోతిష్యం
రాశి ఫలాలు
మహిళలు
పురుషులు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image3
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Related Stories
Recommended image1
Astrology: జూలై 26 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Recommended image2
Astrology: బుధుడి వక్ర గమనం.. ఆ రాశుల వారికి 70 రోజుల కుబేర యోగం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved