Astrology: జూలై 26 నుంచి మహాలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Mahalakshmi Rajayogam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశిలో చంద్రుడు, కుజుడి కలయిక కారణంగా మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. దీని వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇందులో మీ రాశి ఉందేమో చూడండి..

మహాలక్ష్మీ రాజయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు, కుజుడు కలిస్తే మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. మహాలక్ష్మి రాజయోగం చాలా శుభప్రదం. ఈ యోగం ఉన్నవారు ఆర్థికంగా స్థిరపడతారు, జీవితంలో పురోగతి సాధిస్తారు.
మహాలక్ష్మి రాజయోగం ఎలా ఏర్పడుతుంది?
మహాలక్ష్మి రాజయోగం: మహాలక్ష్మి రాజయోగం అనేక గ్రహ సంగమాల వల్ల ఏర్పడుతుంది. అందులో ముఖ్యమైనది కుజ చంద్ర సంగమం. చంద్రుడు మనస్సు, ఐశ్వర్యానికి సూచిక. కుజుడు ధైర్యం, శక్తికి సూచిక. వీటి కలయిక 2, 9, 10, 11 స్థానాల్లో ఉంటే కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈ యోగం కలవారు ధనవంతులై, సామాజికంగా గౌరవాన్ని పొందుతారు.
శుక్రుడు, గురు గ్రహ ప్రాత
మహాలక్ష్మి రాజయోగం మరింత శక్తివంతంగా ఉండేందుకు శుక్రుడు, గురు బలం అవసరం. శుక్రుడు ధనానికి, భోగభాగ్యాలకు ప్రతీక కాగా, అంగారకుడు (గురువు) జ్ఞానానికి, ఆధ్యాత్మికత, ధనసంపదకు సూచిక. ఈ గ్రహాలు కేంద్ర (1, 4, 7, 10) లేదా త్రికోణ (1, 5, 9) స్థానాల్లో ఉన్నప్పుడు రాజయోగ ఫలితాలు మరింత మెరుగవుతాయి.
మహాలక్ష్మి రాజయోగం ఫలితాలు
డబ్బు, ఐశ్వర్యం: ఈ యోగం కలిగినవారికి ఆర్థికంగా శుభఫలితాలు లభిస్తాయి. అనుకోని ఆదాయాలు, పెట్టుబడుల్లో లాభాలు, విలువైన ఆస్తుల కొనుగోలు చేసే అవకాశాలు ఏర్పడతాయి. ధనం సహజంగా చేరే యోగం ఉండటంతో ఐశ్వర్యంగా జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం
మహాలక్ష్మి రాజయోగం ఉన్న వారు సుఖంగా జీవిస్తారు. డబ్బు కష్టాలు ఉండవు. డబ్బు కొరత ఉండదు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అలాగే.. ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు వస్తాయి.
పదోన్నతి
మహాలక్ష్మి రాజయోగం ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది. చేసే పనుల్లో విజయం వస్తుంది. ఆఫీసులో చేయని పనికి కూడా ప్రశంసలు వస్తాయి. పదోన్నతి, జీతం పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత, ప్రేమ పెరుగుతుంది.
ఈ 4 రాశుల వారికి అదృష్టం
జూలై 26న చంద్రుడు సింహ రాశిలో కుజుడితో కలవడం వల్ల మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ నాలుగు రాశుల వారికి ఈ ఫలితాలు వస్తాయి. ఏయే రాశులో చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం వల్ల ఆదాయం పెరుగుతుంది. జూలై తర్వాత ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు లాభం ఇస్తాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ప్రేమ విషయాలు అనుకూలిస్తాయి. వివాహ యోగం కనిపిస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి కుజ చంద్ర సంగమం మంచి ఫలితాలు ఇస్తుంది. మీ ప్లాన్స్ సక్సెస్ అవుతాయి. వ్యాపారస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. వాహనాలు కొనే యోగం ఉంది. ధన, ధాన్య ప్రాప్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి మహాలక్ష్మి యోగం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తాయి. అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. సైన్యం, పోలీసుల్లో పనిచేసే వారికి పదోన్నతులు రావొచ్చు. సైన్యం, పోలీస్ శాఖల్లో పదోన్నతులు సాధ్యమే. క్రీడా రంగంలో ప్రగతి ఉంటుంది. పెట్టుబడుల్లో లాభాలు, సమాజంలో గౌరవం లభిస్తుంది.
తుల రాశి
మహాలక్ష్మి యోగం వల్ల తుల రాశి వారికి మంచి ఫలితాలు అందనున్నాయి. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించవచ్చు. పొదుపు పెట్టుబడిగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. కుటుంబ బాధ్యతలు సజావుగా నెరవేరుతాయి. కుటుంబంలో గౌరవం, ప్రశంసలు లభిస్తాయి.