Vastu Tips: ఈశాన్యంలో ఇలా రాగి చెంబు పెడితే.. ఐశ్వర్యానికి తలుపులు తెరిచినట్లే..!
Vastu Tips: ఎంత కష్టపడినా ఇంట్లో లక్ష్మీదేవి నిలపడం లేదని బాధపడుతున్నారా? సంపాదించినదంతా ఖర్చులకే పోతుందని ఫీలౌతున్నారా? అయితే.. ఈశాన్య దిక్కున ఒక చిన్న మార్పు చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరతాయి.

Vastu Tips
హిందూ ధర్మ శాస్త్రం, వాస్తు శాస్త్రంలో ఇంటి నిర్మాణానికే కాకుండా, ఇంట్లో మనం ఉంచే వస్తువులకు, వాటి దిశలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి వాస్తు శాస్త్రం అనేక సూచనలు సూచిస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనది, అత్యంత ప్రభావితమైనది.. ఈశాన్య దిశలో రాగి చెంబులో నీటిని ఉంచడం. దీనిని చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభించడమే కాకుండా, ఇంట్లోని వాస్తు దోషాలను తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈశాన్యం ఎందుకు అంత ముఖ్యం..?
వాస్తు ప్రకారం ఈశాన్య దిశను దేవ మూల అని పిలుస్తారు. ఈ దిశకు అధిపతి శివుడు. గ్రహాధిపతి గరువు. ఈ దిశలో సాత్విక శక్తి ఎక్కువగా ఉంటుంది.ఇంటికి ఈశాన్యం ఎంత పవిత్రంగా, శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంత శాంతి, సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. ఈశాన్యం జల తత్వానికి సంబంధించినది. అందుకే ఈ మూలలో నీటిని ఉంచడం వల్ల ఆ దిశకు మరింత బలం చేకూరుస్తుంది.
రాగి చెంబు నీటి ప్రత్యేకత..
రాగి (Copper) ఒక పవిత్రమైన లోహం. శాస్త్రీయంగా కూడా రాగికి బ్యాక్టీరియాను అంతం చేసే శక్తి ఉంది. రాగి పాత్రలోని నీరు శక్తివంతమైన తరంగాలను గ్రహించి, పరిసరాల్లో సానుకూలతను వ్యాపింపజేస్తుంది.
ఎలా ఏర్పాటు చేయాలి?:
ఒక శుభ్రమైన రాగి చెంబును తీసుకుని, దాని నిండా స్వచ్ఛమైన నీటిని నింపాలి.
అందులో చిటికెడు పసుపు, కొంచెం గంధం లేదా ఒక రూపాయి నాణేన్ని వేయవచ్చు. వీలైతే కొన్ని తులసి దళాలను కూడా చేర్చవచ్చు.
ఈ చెంబును ఇంటి ఈశాన్య మూలలో ఒక పీటపై గానీ లేదా నేరుగా నేలపై గానీ ఉంచాలి.
ఈ నీటిని ప్రతి గురువారం, సోమవారం మార్చుకోవచ్చు. ఆ పాత నీటిని మొక్కలకు పోసి.. చెంబును శుభ్రం చేసి మళ్లీ కొత్తగా నీటిని నింపాలి.
ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు...
ఆర్థిక అభివృద్ధి: ఈశాన్యంలో నీరు నిండిన రాగి పాత్ర ఉండటం వల్ల సంపదకు మార్గాలు సుగమం అవుతాయి. అనవసర ఖర్చులు తగ్గి, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
నెగిటివ్ ఎనర్జీ తొలగింపు: ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని రాగి , జలం కలిసి గ్రహిస్తాయి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి, సఖ్యత పెరుగుతుంది.
ఆరోగ్య ప్రాప్తి: వాస్తు దోషాల వల్ల కలిగే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ నీటి ద్వారా వెలువడే తరంగాలు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.
లక్ష్మీ కటాక్షం: నీరు నిండిన పాత్ర 'పూర్ణ కుంభం'తో సమానం. నిండుగా ఉన్న నీరు ఇంట్లో కొరత లేని సంపదకు సంకేతం. అందుకే ఇది లక్ష్మీ దేవిని ఆకర్షిస్తుంది.

