MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Vastu tips: ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే మంచిది? వాస్తు శాస్త్రం చెబుతున్నదిదే

Vastu tips: ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే మంచిది? వాస్తు శాస్త్రం చెబుతున్నదిదే

Vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సరైన సంఖ్యలో కిటికీలు ఉండడం చాలా అవసరం. అప్పుడే ఆ ఇంట్లో నివసించే వారు సుఖంగా సంతోషంగా జీవించగలుగుతారు. ఎన్ని కిటికీలు ఉండాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jan 02 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వాస్తుశాస్త్రంలో కిటికీలు
Image Credit : AI Generated

వాస్తుశాస్త్రంలో కిటికీలు

ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు వాస్తును చూస్తాము. వాస్తు ఎంత బలంగా, లాభంగా ఉంటే ఆ ఇంట్లోనే వారు అంత సంతోషంగా జీవిస్తారు. ఇంట్లోని తలుపులు, కిటికీల సంఖ్య కూడా వాస్తు శాస్త్రం నిర్ణయిస్తుంది. ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలో, కిటికీలు ఉండాలో ముందే వాస్తు శాస్త్రం వివరించింది. ఒక ఇంట్లో కిటికీలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి కాంతిని, గాలిని ఇంట్లోకి తీసుకువస్తాయి. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం తలుపుల తర్వాత కిటికీలకే ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లోకి సానుకూల శక్తిని స్థిరంగా తీసుకురావడంలో ఇది సహకరిస్తాయి. కిటికీలు సరైన దశలో ఉండడం సరైన సంఖ్యలో ఉండడం కూడా చాలా అవసరం. 

కిటికీలలాగే తలుపులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు లోపల శక్తి, శుభం, సంపద, ఆరోగ్యం పయనించే మార్గం ఇవే. తలుపులు సరిగా లేకపోతే సానుకూల శక్తి సరైన దిశలో ప్రవహించదు. ప్రధాన తలుపు (హౌస్ మైన్ డోర్) దిశ, ఆరంభం, కొలతలు కూడా చాలా ముఖ్యం. ఈ తలుపు సరిగా ఉండకపోతే ఇల్లు లోపల శక్తి అసమతుల్యంగా ఉంటుంది. దాని వల్ల ప్రభావం ఆరోగ్యం, సంపద, కుటుంబ శాంతిపై పడుతుంది.

23
ఎన్ని కిటికీలు ఉండాలి?
Image Credit : Getty

ఎన్ని కిటికీలు ఉండాలి?

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లోని కిటికీల సంఖ్య ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉండాలి. అంటే రెండు 4, 6, 8... ఇలా ఉండాలి. అంతేతప్పా 3, 5, 7... వంటి బేసి సంఖ్యలో ఉండకూడదు. ఇంట్లో సరి సంఖ్యలో కిటికీలు ఉంటే ఆ ఇంటి వాస్తు సరిగా ఉందని అర్థం. అదే బేసి సంఖ్యలో కిటికీలు ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. కాబట్టి ఇల్లు నిర్మించేటప్పుడే కిటికీల సంఖ్య పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

వాస్తు శాస్త్రంలో తలుపులు, కిటికీలు సరైన దిశలో అమర్చడం చాలా ముఖ్యం. దీనివల్ల ధనం, సంపద అవకాశాలు ఇంటి లోపలికి ప్రవహిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రధాన తలుపు చిన్నగా ఉంటే సంపద బయటకు పోతుంది. కాబట్టి తలుపులు సరైన కొలతలతో, సరైన దిశలో ఉండాలి.

Related Articles

Related image1
Shani Venus Conjunction: కలిసిరాబోతున్న శని శుక్రులు.. జనవరి 15 నుంచి ఈ 3 రాశులకు అదృష్టం
Related image2
Chhatrapati Shivaji Death: ఛత్రపతి శివాజీ ఎలా మరణించారు? రెండో భార్య హత్య చేసిందా?
33
కిటికీలు ఏ దిశలో ఉండాలి?
Image Credit : Getty

కిటికీలు ఏ దిశలో ఉండాలి?

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం కిటికీలు ఇంటికి సానుకూల శక్తిని తీసుకురావాలంటే.. ఉత్తరం, తూర్పు వైపు మాత్రమే ఉండాలి. ఈ దిశలో కిటికీలు ఉంటే సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి వస్తాయి. ఇలా రావడం వల్ల ఆ ఇల్లు సుఖసంతోషాలతో తులతూగుతుంది. అలాగే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. కిటికీలు అన్నీ కూడా సమాన ఎత్తులో ఉండేలా చూసుకోండి. కొన్ని కిటికీలు ఎత్తుగా, మరికొన్ని చిన్నవిగా ఉండకూడదు. అలాగే వీటిని అప్పుడప్పుడు శుభ్రపరుచుకోవాల్సిన అవసరం ఉంది. సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశించాలంటే పగటిపూట అన్ని కీటకీలను తెరిచి ఉంచేందుకు ప్రయత్నించాలి. సాయంత్రం మాత్రం వాటిని మూసివేస్తేనే మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫస్ట్ నైట్ రోజున ఇవి దూరం పెడితే.. ఆ సుఖంలో పీక్స్‌కు వెళ్తారట..
Recommended image2
Love Psychology: సైకాలజీ ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?
Recommended image3
Wedding Anklets: పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం హెవీ డిజైన్ పట్టీలు.. ఇవిగో
Related Stories
Recommended image1
Shani Venus Conjunction: కలిసిరాబోతున్న శని శుక్రులు.. జనవరి 15 నుంచి ఈ 3 రాశులకు అదృష్టం
Recommended image2
Chhatrapati Shivaji Death: ఛత్రపతి శివాజీ ఎలా మరణించారు? రెండో భార్య హత్య చేసిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved