Zodiac signs: ఈ రాశులవారికి నోటి దూల చాలా ఎక్కువ, మాటలతో చిక్కుల్లో పడతారు..!
కొన్ని రాశులవారు ఎక్కువగా వారు మాట్లాడే మాటలతో తలనొప్పులు తెచ్చుకుంటారు. నిజం మాట్లాడే ధైర్యం ఉన్నా, అది చెప్పే తీరు, సందర్భం వల్ల పరిణామాలు తేడా ఉంటాయి.

ప్రతి రాశికి ఒక్కో ప్రత్యేక గుణం, స్వభావం ఉంటుంది. కొంత మంది మంచి హృదయాన్ని కలిగి ఉన్నా, లోలోపల మంచి అభిప్రాయం ఉన్నా, మాట్లాడే తీరుతో సమస్యలు తెచ్చుకుంటారు. తమ మాటల వల్ల ఇతరులను బాధ పెట్టి చివరకు తామే సమస్యల్లో పడుతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి రాశులు చాలానే ఉన్నాయి. కొన్ని రాశులవారు ఎక్కువగా వారు మాట్లాడే మాటలతో తలనొప్పులు తెచ్చుకుంటారు. నిజం మాట్లాడే ధైర్యం ఉన్నా, అది చెప్పే తీరు, సందర్భం వల్ల పరిణామాలు తేడా ఉంటాయి. మరి, తమ మాటలతో చిక్కుల్లో పడే 7 రాశుల గురించి తెలుసుకుందాం..
telugu astrology
1. మేష రాశి (Aries)
మేష రాశివారు ఏ విషయం అయినా నేరుగా మాట్లాడతారు. వారి మనసుకు ఏం తోస్తే అదే చెబుతారు. క్షణంలో స్పందించే స్వభావం కలిగే ఉండటంతో, ముందూ వెనకా ఆలోచించకుండా మాట్లాడతారు. దీని వల్ల ఇతరుల మనసును గాయపరుస్తారు. సున్నితమైన విషయాలపైన కూడా ఘాటుగా స్పందించడం వల్ల కూడా గొడవలు తలెత్తుతాయి.
telugu astrology
2. మిథునం (Gemini)
బహుముఖ ప్రజ్ఞ కలిగిన మిథున రాశివారు, చురుకైన మాటలతో ఆకట్టుకుంటారు. కానీ ఎక్కువగా మాట్లాడే అలవాటుతో అప్రతిష్టకు గురవుతారు. అసలు అవసరం లేని విషయాలు కూడా బయటపెట్టి తామే చిక్కుల్లో పడుతారు. తమ మాటల వల్లే సమస్యల పాలవుతారు.
telugu astrology
3. సింహం (Leo)
ఆత్మవిశ్వాసంతో మాట్లాడే వీరి మాటల్లో కొంత గర్వం, అధికత్వ భావం కనిపిస్తుంది. ఇతరులను తక్కువగా చూసే ధోరణి వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతుంది. ఇది ఇతరులలో అసహనాన్ని కలిగించి గొడవలకు దారి తీస్తుంది. దీని వల్ల ఈ రాశివారు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు.
telugu astrology
4. వృశ్చికం (Scorpio)
ఈ రాశివారికి సహనం తక్కువ. చిన్న విషయానికే తీవ్రంగా స్పందించి కోపంగా మాట్లాడతారు. మాటలతో పక్కవారిని గాయపరచడం వీరి అలవాటు. ఒకసారి కోపం వచ్చినా మాత్రం నిబంధనలు, సంబంధాలు అన్నీ మరిచిపోతారు. దీని వల్ల ఈ రాశివారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
telugu astrology
5. ధనుస్సు (Sagittarius)
ఈ రాశివారు నిజాలు మాత్రమే మాట్లాడతారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీరు నిజాలే మాట్లాడతారు. కానీ అప్పుడు అది అవసరమా? ఎలా చెప్పాలో అన్న విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తారు. ఆవేశంలో చెప్పిన మాటలు ఇతరులను బాధపెట్టేలా ఉంటాయి.
telugu astrology
6. మకరం (Capricorn)
ఈ రాశివారు ఎక్కువ లక్ష్యంపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంంటారు. ఈ క్రమంలో వీరు మనసులో ఎవరినీ పెట్టుకోరు. కఠినమైన వాక్యాలతో ఇతరుల మనోభావాలను గాయపరుస్తారు. మాటల్లో మృదుత్వం లేకపోవడం వల్ల వారిపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది.
telugu astrology
7. కుంభం (Aquarius)
స్వేచ్ఛ ప్రియులు అయిన కుంభ రాశివారు, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం కష్టం. ఆవేశంలో తమ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నంలో, పక్కవారిని తిడుతున్నట్టే భావన కలుగుతుంది. దీనివల్ల సంబంధాల్లో సమస్యలు తలెత్తుతాయి.
మాటల ముందు ఆలోచన ముఖ్యం!
ఈ రాశులవారు నిజాయితీగా ఉండడం, ధైర్యంగా మాట్లాడడం మంచిదే. కానీ, ప్రతి మాట ముందు ఆలోచించడం అవసరం. అప్పుడే మనం ఇతరులను గౌరవించగలుగుతాం, సంబంధాలు బలంగా నిలుపుకోగలుగుతాం. కాబట్టి – “మాట జాగ్రత్త!” అనే మాటను మనసులో పెట్టుకోవాలి.