బంగారు, వెండి ఆభరణాలు పెట్టుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు వెండి ఆభరణాలు అస్సలు పెట్టుకోకూడదట. దానివల్ల వారికి నష్టాలు జరిగే అవకాశం ఉందట. మరి ఏ రాశివారు వెండి జోలికి వెళ్లకూడదో ఇక్కడ చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రంలో బంగారం, వెండి సహా ఇతర లోహాల గురించి చాలా విషయాలు చెప్పారు. ఒక్కో లోహానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారు బంగారు ఆభరణాలు ధరించడం మంచిదికాదు. మరికొందరు వెండి ఆభరణాలు పెట్టుకోవడం మంచిదికాదు. సాధారణంగా వెండిని చంద్ర గ్రహానితో పోలుస్తారు. వెండి ధరించడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని నమ్ముతారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశిచక్రాల వారు వెండి ధరించకూడదు. ఒకవేళ ఈ రాశుల వారు వెండి ధరిస్తే జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం.
ఈ రాశులవారు వెండి పెట్టుకోకూడదు!
వృషభ రాశి
జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారు అస్సలు వెండి ధరించకూడదు. వెండి ధరించడం వల్ల వారి జీవితంలో సమస్యలు వస్తాయి. వారు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు. కాబట్టి వృషభ రాశి వారు వెండి ధరించక పోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
సింహ రాశి
సింహ రాశి వారు వెండి ఆభరణాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సింహ రాశి అధిపతి సూర్యుడు. కాబట్టి సింహ రాశి వారు వెండి ధరిస్తే వారు సంపాదించిన డబ్బు నీటిలా ఖర్చవుతుంది. వెండి ధరించడం వల్ల వారికి ఆర్థిక ప్రగతి ఉండదు.
మకర రాశి
ఈ రాశి వారు కూడా వెండి ఆభరణాలు ధరించకూడదు. వెండి ధరించడం వల్ల వీరి కుటుంబంలో మనస్తాపాలు, గొడవలు పెరుగుతాయి. భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గి, సంసారంలో కలహాలు ఏర్పడతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ, సింహ, మకర రాశివారు వెండి ధరించకపోవడమే మంచిది. వీరు వెండి ధరిస్తే.. లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఒకవేళ ఈ రాశులవారు వెండి ఆభరణాలు పెట్టుకోవాలనుకుంటే.. జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
గమనిక:
జ్యోతిష్య శాస్త్రంలోని సమాచారం జ్యోతిష్యులు, పంచాంగం, ధార్మిక గ్రంథాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.