MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • భార‌త్‌లో రూ. 65 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న అమెజాన్‌.. ఏ రాష్ట్రంలో ఏంతంటే?

భార‌త్‌లో రూ. 65 వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న అమెజాన్‌.. ఏ రాష్ట్రంలో ఏంతంటే?

Amazon: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. 2030 నాటికి దేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.65 వేల కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

3 Min read
Author : Narender Vaitla
Published : Nov 17 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2030 నాటికి రూ.65 వేల కోట్ల పెట్టుబడులు
Image Credit : amazon

2030 నాటికి రూ.65 వేల కోట్ల పెట్టుబడులు

భారత్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం 7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశంలో 4 బిలియన్ డాలర్ల విలువైన పునరుత్పాదక ఇంధన పెట్టుబడులను ఖరారు చేసింది. వీటికి అదనంగా తాజా పెట్టుబడులు రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా భారతదేశంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఊతం లభించనుంది. అలాగే పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కూడా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడనున్నాయి. భారత్‌లో కార్బన్ రహిత విద్యుత్ కొనుగోలు చేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో అమెజాన్ ఒకటిగా నిలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టులు
Image Credit : our own

కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టులు

అమెజాన్ తాజాగా భారత్‌లో నాలుగు కొత్త సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ప్రకటించింది. వీటి ద్వారా మొత్తం 934 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఇందులో కర్ణాటకలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. కర్ణాటకలో 234 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు. ఆసియాలో ఇప్పటివరకు అమెజాన్ ఒప్పందం చేసుకున్న అతిపెద్ద పవన విద్యుత్ ప్రాజెక్టు ఇదే. మధ్యప్రదేశ్‌లో 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు. రాజస్థాన్‌లో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టుల కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (Power Purchase Agreements - PPAs) చేసుకుంది. ఇవి ఇప్పటికే అమెజాన్ ఖరారు చేసిన 4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల పరిధిలోకి వస్తాయి. ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమెజాన్‌కు భారత్‌లో 2 గిగావాట్లకు పైగా పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది.

35
35 లక్షల ఇళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి
Image Credit : Getty

35 లక్షల ఇళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి

అమెజాన్ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే ఏడాదికి 35 లక్షలకు పైగా భారతీయ కుటుంబాల విద్యుత్ అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. దీనివల్ల దేశంలో స్వచ్ఛమైన విద్యుత్ సరఫరా పెరగడంతో పాటు సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంటుంది. భారత్‌లో విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి భారీ పెట్టుబడులు కీలకంగా మారనున్నాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఇంధన భద్రతకు కూడా ఇవి దోహదపడతాయి. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది.

45
2030 నాటికి కార్బన్ ఉద్గారాలు 65 శాతం తగ్గింపు
Image Credit : our own

2030 నాటికి కార్బన్ ఉద్గారాలు 65 శాతం తగ్గింపు

అమెజాన్ తన ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు సంబంధించి మరో కీలక లక్ష్యాన్ని ప్రకటించింది. 2030 నాటికి విద్యుత్ వినియోగం ద్వారా ఏర్పడే కార్బన్ ఉద్గారాల తీవ్రతను 65 శాతం తగ్గించాలని నిర్ణయించింది. 2019లో నమోదైన ఉద్గారాల స్థాయిని ప్రామాణికంగా తీసుకుని ఈ లక్ష్యాన్ని నిర్దేశించింది. అంటే సంస్థ వినియోగించే ప్రతి యూనిట్ విద్యుత్‌కు సంబంధించిన కార్బన్ ఉద్గారాలు 2019తో పోలిస్తే 65 శాతం తగ్గించాలన్నది లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు పెరుగుతున్నప్పటికీ పర్యావరణానికి హాని తగ్గించే దిశగా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

2040 నాటికి తమ సంస్థను పూర్తిస్థాయిలో నెట్‌ జీరో కార్బన్ సంస్థగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేపడుతోంది. అంటే కార్యకలాపాల ద్వారా వెలువడే కార్బన్ ఉద్గారాలను సాధ్యమైనంత వరకు తగ్గించి, మిగిలిన ఉద్గారాలను సమతుల్యం చేయడం ద్వారా నికర కార్బన్ ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలన్నది సంస్థ ఉద్దేశం.

55
భారత్‌లో ఇప్పటికే 57 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు
Image Credit : our own

భారత్‌లో ఇప్పటికే 57 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు

భారత్‌లో అమెజాన్ ఇప్పటికే పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన ప్రాజెక్టులను చేపట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి విద్యుత్ గ్రిడ్‌కు కార్బన్ రహిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. వీటితో పాటు అమెజాన్‌కు చెందిన కార్యాలయాలు, ఇతర సదుపాయాల వద్ద 43 సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సంస్థ కార్యకలాపాలకు అవసరమైన విద్యుత్‌లో కొంత భాగాన్ని సౌరశక్తి నుంచి పొందుతోంది. మొత్తంగా భారత్‌లో 57 పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.

ఈ పెట్టుబడులపై కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు భారత్ స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దేశంలో ఇంధన భద్రత బలోపేతం కావడంతో పాటు ఆర్థిక వృద్ధికి, కొత్త అవకాశాల కల్పనకు ఇవి దోహదపడతాయని తెలిపారు.

అమెజాన్ చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ కారా హర్స్ట్ మాట్లాడుతూ.. భారత్‌లో అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలిక నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. 2070 నాటికి నెట్‌ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలనే భారత్ ప్రయత్నాలకు తమ పెట్టుబడులు తోడ్పడతాయని వెల్లడించారు. మొత్తంగా అమెజాన్ తాజా నిర్ణయం భారత్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతమివ్వనుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
 
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(35.4 ov)118/3
SLSL
98
Day 1 - Session 3
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Silver Price: ఏంటీ ఇది నిజమా? రూ.లక్షకు పడిపోతున్న బంగారం, కుప్పకూలుతున్న వెండి
Recommended image2
Indian Railways: విద్యార్థులకు ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. వారికి ఉచిత ప్రయాణ సదుపాయం
Recommended image3
Gold Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తులం బంగారం రూ.లక్షా25 వేలే, వెండి కూడా ఢమాల్
Related Stories
Recommended image1
100 కోట్ల వ్యూస్ దిశ‌గా దూసుకెళ్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్‌.. ఇంత‌లా ఈ పాట‌లో ఏముంద‌బ్బా?
Recommended image2
Iron and Steamer: ఇస్త్రీ కోసం ఇంకా అవే ఐర‌న్ బాక్సులే కొంటున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved