MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • Tirumala : ఈ వేసవిలో తిరుమలకు వెళుతున్నారా..? శ్రీవారి దర్శనం ఈజీగా పొందే టిప్స్ ఇవే

Tirumala : ఈ వేసవిలో తిరుమలకు వెళుతున్నారా..? శ్రీవారి దర్శనం ఈజీగా పొందే టిప్స్ ఇవే

Tirumala Travel Guide : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెెంకటేశ్వర స్వామి దర్శనానికి వెెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా…? అయితే ఈ సమ్మర్ రద్దీలోనూ శ్రీవారి దర్శనం ఈజీగా పొందే టిప్స్ మీకోసమే. 

2 Min read
Author : Arun Kumar P
Published : May 02 2026, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిరుమల సమాచారం...
Image Credit : getty

తిరుమల సమాచారం...

Tirumala : పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి... కాబట్టి చాలామంది కుటుంబంతో కలిసి తిరుమల యాత్ర ప్లాన్ చేస్తుంటాయి. అయితే సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది... కాబట్టి కుటుంబంతో కలిసి వెళ్లాలనుకునేవారు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే పూర్తి సమాచారం తెలుసుకుంటే మంచిది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లు ఎలా పొందాలి..? ఆన్ లైన్ లో కాకుండా నేరుగా వెళ్లి ఎక్కడ తీసుకోవచ్చు..? టిటిడి అందించే సౌకర్యాలేమిటి..? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆన్లైన్ లో తిరుమల టికెట్లు ఎలా పొందాలి..?
Image Credit : Getty

ఆన్లైన్ లో తిరుమల టికెట్లు ఎలా పొందాలి..?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం టికెట్లను మీరు ముందుగానే (Advance Booking) బుక్ చేసుకోవచ్చు. నిజానికి తిరుమలకు వెళ్లి చివరి నిమిషంలో దర్శనం టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా ఉండటానికి ముందే బుక్ చేసుకోవడం ఉత్తమం. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan - రూ.300) : ఇవి సాధారణంగా 2 నుండి 3 నెలల ముందే విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా దర్శించుకోవాలని అనుకుంటే ఇది మంచి ఆప్షన్.

ఆర్జిత సేవలు : శ్రీవారి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని అనుకునేవారు ప్రత్యేక సేవల టికెట్లు పొందవచ్చు. సుప్రభాతం, తోమాల, అర్చన వంటి సేవలు లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తారు. వీటికి కూడా కొన్ని నెలల ముందే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

35
నేరుగా శ్రీవారి దర్శన టికెట్లు ఎక్కడ పొందాలి..?
Image Credit : TTD.com

నేరుగా శ్రీవారి దర్శన టికెట్లు ఎక్కడ పొందాలి..?

ముందుగా ఆన్లైన్ లో శ్రీవారి దర్శన టికెట్లు లేకుండా నేరుగా తిరుమల యాత్ర చేపట్టేవారు తిరుపతిలోనే అలర్ట్ కావాలి. ఎందుకంటే అక్కడే భక్తులకు సర్వదర్శనం (SSD Tokens) టికెట్లు లభిస్తాయి. తిరుపతి ఆర్టిసి బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం లేదా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర్లోని విష్ణు నివాసంలో ఫ్రీ దర్శనం టోకెన్లు లభిస్తాయి. మామూలుగా అయితే ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు ఏ సమయంలో అయినా టోకేన్స్ జారీ చేస్తారు... అయితే ప్రస్తుతం వేసవి ఎండల నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ టోకెన్స్ పంపిణీ చేపడుతున్నారు.

తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు పొందలేనివారు తిరుమలలో పొందవచ్చు. అలిపిరి బస్టాండ్ వద్దగల భూదేవి కాంప్లెక్స్ లో కూడా దర్శన టికెట్ల పంపిణీ జరుగుతుంది. ఈ టోకెన్స్ తీసుకుని ఏడుకొండలపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ ఉచిత దర్శన టోకెన్లు ఎవరు ముందుగా వస్తే వారికే అందుతాయి... కాబట్టి భక్తులు వీలైనంత ముందే పంపిణీ ప్రాంతాలకు చేరుకుంటే మంచిది.

45
శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు...
Image Credit : TTD Website

శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు...

ఆన్లైన్, ఆఫ్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు పొందలేకున్నా సరే... స్వామిని దర్శించుకోవచ్చు. కానీ ఇది కొంచెం కాస్ట్లీ వ్యవహారం. శ్రీవాణి (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్ట్ కు రూ.10000 విరాళం ఇచ్చి విఐపి బ్రేక్ దర్శన టికెట్ పొందవచ్చు. విరాళం దాత, వారి కుటుంబసభ్యులకు ఉదయం సుప్రభాత సేవ తర్వాత శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తారు.

55
తిరుమలలో వసతి ఎలా..?
Image Credit : Getty

తిరుమలలో వసతి ఎలా..?

తిరుమలలో భక్తుల వసతి కోసం టిటిడి ఏర్పాట్లు చేసింది... అనేక భవనాల్లో వసతి కల్పిస్తున్నారు. దర్శనం మాదిరిగానే గదులను కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు... లేదంటే నేరుగా వెళ్ళి టోకెన్లు పొంది రూం తీసుకోవచ్చు.

బుకింగ్ లేకుండా నేరుగా తిరుమలలో వసతి కావాలంటే ఉదయం 6 నుండి 10 గంటల వరకు సిఆర్వో (సెంట్రల్ రిసెప్షప్ ఆఫీస్) వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. గదులు అందుబాటులో ఉంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్దతిలో కేటాయిస్తారు. తిరుమలలో ఉచిత వసతి కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి.

ఒకవేళ ఉచిత గది లభించలేదంటే వస్తువులను దాచుకునేందుకు లాకర్ సదుపాయం ఉంటుంది. యాత్రి సదన్, శ్రీ పద్మనాభ నిలయం, వెంకటాద్రి నిలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం... ఇలా చాలాచోట్ల భక్తులకు లాకర్ సదుపాయం కల్పిస్తారు. ఇక్కడ తమ వస్తువులు దాచుకుని భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లవచ్చు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్
ఆధ్యాత్మిక విషయాలు
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra pradesh: రాజ‌కీయాల్లో విషాదం.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం క‌న్నుమూత
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు ఇదే కరెక్ట్ టైమ్.. గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పిలు అయిపోవచ్చు
Recommended image3
Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
Related Stories
Recommended image1
Siddhidatri: అమ్మవారికి చెప్పులను నైవేద్యంగా సమర్పించే వింతైన ఆలయం.. ఈ గుడి ఎక్కడ ఉందంటే
Recommended image2
Mystery Temple: రాత్రయితే చాలు కాళీమాత విగ్రహం మాయమయ్యే ఆలయం, ఎందుకలా జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved