Mystery Temple: రాత్రయితే చాలు కాళీమాత విగ్రహం మాయమయ్యే ఆలయం, ఎందుకలా జరుగుతుంది?
Mystery Temple:మనదేశంలో ఉన్న ఆలయాల్లో కొన్ని ఎంతో ప్రత్యేకమైనవి. రాత్రయితే చాలు ఆ గుడిలో ఉన్న కాళీమాత విగ్రహం మాయమైపోతుంది. ఎందుకలా జరుగుతుందో తెలుసుకోండి.

కాళీదేవి మాయమయ్యే ఆలయం
దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా, కొన్ని ఆలయాలు ప్రత్యేక నమ్మకాలను కలిగి ఉన్నాయి. అటువంటి ఒక ఆలయం ఇది. ఈ ఆలయంలో కాళీ దేవి విగ్రహం పగటిపూట భక్తులకు దర్శనమిస్తుందట. కానీ రాత్రి అయ్యేసరికి ఆ విగ్రహం ఆలయంలో కనిపించదని స్థానికులు చెబుతున్నారు. ఉదయం మళ్లీ అదే విగ్రహం ఆలయంలో దర్శనమిస్తుందని వారు విశ్వసిస్తున్నారు. భక్తులు దీన్ని ఆ దేవి మహిమగా భావిస్తారు. కాళీ దేవి భక్తుల కష్టాలు తీర్చేందుకు రాత్రి బయటకు వెళ్లి వస్తుందనే నమ్మకం అక్కడ బలంగా ఉంది. ఈ వింత సంఘటన గురించి మీడియా కూడా కథనాలు ప్రచురించడంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఈ ఆలయం ఎక్కుడుంది?
ఈ ఆలయం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నవోగావ్ సమీపంలోని కాశీపూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు చెబుతున్న ప్రకారం కాళీమాతను విగ్రహంగా కాకుండా జీవంతో ఉన్న శక్తిగా భావిస్తారు. రాత్రి సమయంలో భక్తులు నిద్రలో ఉండగా దేవి వారి సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చేందుకు వెళ్లి వస్తుందని నమ్మకం. అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు వంటి వాటితో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే తమ సమస్యలు తగ్గాయని కొందరు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించి పూజలు చేస్తుంటారు. ఆ కాళీ మాత తమ మాట వింటుందని, తమ బాధలు అర్థం చేసుకుంటుందని వారు నమ్ముతున్నారు.
పెరుగుతున్న భక్తులు
ఆలయం గురించి తెలిసిన తరువాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తున్నారు. కొందరు తమ జీవితంలో ఎదురైన సమస్యలు దేవి కృపతో పరిష్కారం అయ్యాయని చెబుతున్నారు. దీంతో ఈ ఆలయం ఒక విశేష ఆలయంగా మారింది. పండుగల సమయంలో అయితే భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఆలయం వద్ద ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం హారతులు జరుగుతున్నాయి. రాత్రి ఆలయం మూసిన తర్వాత విగ్రహం కనిపించదని కొందరు చెబుతుంటే, ఉదయం మళ్లీ దర్శనమిస్తుందని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసామని చెప్పేవారు కూడా ఉన్నారు. దీంతో ఈ విషయం మరింత ఆసక్తిగా మారింది.
నమ్మకమే ప్రధానం
కొందరు ఈ ఆలయం గురించి భిన్నంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయమే తప్ప... దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని కొందరు అంటున్నారు. ఆలయంలో జరిగే పూజా విధానాల్లో భాగంగా విగ్రహాన్ని రాత్రి వేరే చోట ఉంచి ఉండవచ్చని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా, భక్తుల విశ్వాసాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే దేవాలయాలు నమ్మకానికి, శాంతికి, ఆశకు ప్రతీకలుగా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. కాళీ దేవి ఆలయం విషయంలో కూడా భక్తుల విశ్వాసమే ప్రధానంగా కొనసాగుతోంది.

