MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. అక్టోబర్ 15 నుంచి 18 మధ్య కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2026, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాతావరణంలో భారీ మార్పులు.. వానలే వానలు
Image Credit : chatgpt

వాతావరణంలో భారీ మార్పులు.. వానలే వానలు

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణంలో భారీ మార్పులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనానికి వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. మళ్లీ వానలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 15 నుంచి 18 తేదీల మధ్య కాలంలో పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారుతుండటంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణలో ఏయే జిల్లాల్లో వానలు పడతాయంటే?
Image Credit : Google AI

తెలంగాణలో ఏయే జిల్లాల్లో వానలు పడతాయంటే?

తెలంగాణలోని పలు ఉమ్మడి జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల్లో వానలు పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అలాగే మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాజధాని హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రివేళల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడా వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈ వర్షాల రాకతో ఉక్కపోత తగ్గి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది.

35
ఏపీలో అల్పపీడన ప్రభావం.. కోస్తా, రాయలసీమలో దంచికొట్టనున్న వానలు
Image Credit : AI

ఏపీలో అల్పపీడన ప్రభావం.. కోస్తా, రాయలసీమలో దంచికొట్టనున్న వానలు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి.

ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, బాపట్లతో పాటు రాయలసీమ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

45
ఉత్తర కోస్తాలోనూ తేలికపాటి జల్లులు.. మత్స్యకారులకు హెచ్చరికలు
Image Credit : Gemini

ఉత్తర కోస్తాలోనూ తేలికపాటి జల్లులు.. మత్స్యకారులకు హెచ్చరికలు

ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తదితర ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో కమ్ముకుని ఉంటుందని, అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల వెంబడి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో ఎండ తీవ్రత నుంచి ఊరట లభిస్తుంది.

అయితే సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

55
అన్నదాతలకు సంజీవనిలా మారిన వర్షాలు
Image Credit : Gemini

అన్నదాతలకు సంజీవనిలా మారిన వర్షాలు

సామాన్య ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలకు మాత్రం ఈ వర్షాలు వరంలా మారనున్నాయి. భూగర్భ జల మట్టాలు అమాంతం పెరగడంతో పాటు, ఎండిపోతున్న చివరి దశ పంటలకు ఈ వర్షపు నీరు ప్రాణం పోస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

అయితే పల్లపు ప్రాంతాల రైతులు పంట పొలాల్లో నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసే వారు కూడా వాతావరణ పరిస్థితిని గమనించి తగినట్లుగా ప్లాన్ చేసుకోవడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
తిరుపతి
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AP Local Body Elections 2026 : మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు... ఎక్కడ, ఎవరికి అవకాశమో తెలుసా?
Recommended image2
Rice: డీమార్ట్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Recommended image3
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
Related Stories
Recommended image1
Rice: డీమార్ట్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Recommended image2
IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved