MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్

IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్

IRCTC South India Tour: ఐఆర్‌సీటీసీ 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ఈ 6 రాత్రులు, 7 రోజుల టూర్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 12 2026, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే టెంపుల్ టూర్ ప్యాకేజీ
Image Credit : Chatgpt

ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే టెంపుల్ టూర్ ప్యాకేజీ

ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను చుట్టే వచ్చేందుకు 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' పేరుతో కొత్త ఫ్లైట్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 24న ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్లైట్ షెడ్యూల్.. వివరాలు
Image Credit : https://www.nativeplanet.com/

ఫ్లైట్ షెడ్యూల్.. వివరాలు

ఈ టూర్ పూర్తిగా విమాన ప్రయాణం ద్వారా సాగుతుంది. అక్టోబర్ 24న ఉదయం 06:10 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ బయలుదేరి, ఉదయం 07:55 గంటలకు త్రివేండ్రం చేరుకుంటుంది. అలాగే అక్టోబర్ 30న రాత్రి 21:55 గంటలకు త్రిచిలో బయలుదేరి రాత్రి 23:20 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో మొత్తం 6 రాత్రులు, 7 రోజులు ప్రయాణం ఉంటుంది.

35
ప్యాకేజీ ధరల వివరాలు
Image Credit : Asianet News

ప్యాకేజీ ధరల వివరాలు

ఈ టూర్ ప్యాకేజీ ధరలు ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఆధారంగా మారతాయి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 58,250గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 44,800, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 42,100 చెల్లించాలి. ఇక పిల్లలకు సంబంధించి బెడ్‌తో కూడిన చైల్డ్ (5-11 ఏళ్లు) ధర రూ. 36,250గా ఉంది. బెడ్ లేకుండా అయితే రూ. 29,950, అలాగే 2 నుంచి 4 ఏళ్ల పిల్లలకు రూ. 23,300గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో 7 అల్పాహారాలు, 6 డిన్నర్లు అందిస్తారు.

45
రోజువారీ ప్రయాణ ప్రణాళిక
Image Credit : maduraimeenakshi0046 Instagram

రోజువారీ ప్రయాణ ప్రణాళిక

మొదటి రోజు త్రివేండ్రం చేరుకుని పూవార్ ఐలాండ్, అళిమల శివ ఆలయం సందర్శిస్తారు. రెండవ రోజు పద్మనాభస్వామి ఆలయ దర్శనం తర్వాత కన్యాకుమారికి పయనం అవుతారు. మూడవ రోజు రాక్ మెమోరియల్, తిరువళ్లువర్ విగ్రహం చూసి రామేశ్వరానికి వెళతారు. నాలుగో రోజు రామేశ్వరం స్థానికాలయాలు, ధనుష్కోడి సందర్శన ఉంటుంది. ఐదవ రోజు అబ్దుల్ కలాం మెమోరియల్ చూసి మధురైకి వెళ్లి మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆరవ రోజు అళగర్ కోయిల్, త్రిచిలోని శ్రీరంగం, జంబుకేశ్వర ఆలయాలను సందర్శిస్తారు. ఏడవ రోజు తంజావూరు బృహదీశ్వర ఆలయం చూసి త్రిచి ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

55
ముఖ్యమైన సూచనలు.. బుకింగ్ వివరాలు
Image Credit : nextstopwonderss Instagram

ముఖ్యమైన సూచనలు.. బుకింగ్ వివరాలు

ఈ యాత్రలో ఏసీ బస్సుల ద్వారా సైట్‌సీయింగ్ ఉంటుంది. 75 ఏళ్లు దాటిన ప్రయాణికులు కచ్చితంగా తోడుగా ఒక కుటుంబ సభ్యుడిని లేదా ఎస్కార్ట్‌ను తీసుకెళ్లాలి. పెద్ద బస్సులు వెళ్లని చోట స్థానిక ఆటోలను లేదా సొంత ఏర్పాట్లను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్ బుకింగ్స్, మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఎస్‌డీ రోడ్డులో ఉన్న ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మొబైల్ నంబర్ 8287932229 ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఉద్యోగం వదిలేసి పీతల వ్యాపారంతో రోజుకు రూ.14 లక్షలు సంపాదిస్తున్న యువతి
Recommended image2
Mushrooms : ఏంటీ..కిలో మష్రూమ్స్ రూ.60 లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు
Recommended image3
అక్బర్ చక్రవర్తికి ఎన్ని వేల ఎకరాల భూమి ఉండేదో తెలుసా? ఇప్పుడు ఆ భూమి ఎవరి దగ్గర ఉంది?
Related Stories
Recommended image1
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
Recommended image2
రూ.12 వేలకే 5G ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా డీల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved