MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల కొన్ని రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు చేసింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 04 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో ఆవర్తనం.. : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు
Image Credit : Gemini

బంగాళాఖాతంలో ఆవర్తనం.. : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు

గత కొన్ని రోజులుగా ఎండలు, ఉక్కపోతతో నలిగిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ ఒక్కసారిగా మారిపోనుంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై, రాగల కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలు స్పష్టంగా కనిపించేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్రప్రదేశ్‌ లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌ లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ వ్యాప్తంగా వాతావరణం కూల్‌గా మారనుంది. ముఖ్యంగా ఆదివారం (అక్టోబర్ 4) రోజున అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ తీర ప్రాంతాల్లో విస్తారంగా జల్లులు పడే వీలుంది. సముద్రం బాగా అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవాళ్లు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తిరిగొచ్చేయాలని అధికారులు హెచ్చరించారు.

35
తెలంగాణలో ఏయే జిల్లాల్లో వర్షం పడొచ్చు?
Image Credit : Gemini

తెలంగాణలో ఏయే జిల్లాల్లో వర్షం పడొచ్చు?

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఆదివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం వుంది.

రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత ముదిరే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

45
ఈ జిల్లాల్లో వర్షాల అలర్ట్
Image Credit : Google AI

ఈ జిల్లాల్లో వర్షాల అలర్ట్

• అక్టోబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.

• అక్టోబర్ 6: పైన పేర్కొన్న జిల్లాలతో పాటు భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఈదురుగాలుల హోరు.

• అక్టోబర్ 7: గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వరంగల్, హన్మకొండ సహా దాదాపు 23 కంటే ఎక్కువ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన విస్తారమైన వర్షాలు.

55
ప్రజలు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Image Credit : Gemini

ప్రజలు, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

ఈ వాతావరణ మార్పులతో కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 31-32 డిగ్రీల వరకు, రాత్రివేళల్లో 22-23 డిగ్రీలకు పడిపోయే సూచనలు ఉన్నాయి. ఈదురుగాలులు, ఉరుములు వచ్చే టైంలో ప్రజలు సేఫ్‌‌గా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.

1. వర్షం పడుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లు, ఫ్లెక్సీ హోర్డింగ్స్ కింద నిలబడకూడదు.

2. పిడుగులు పడే సూచనలు కనిపించగానే పొలాల్లో ఉండే రైతులు, పశువుల కాపరులు తక్షణమే పక్కనే ఉన్న గట్టి భవనాల్లోకి వెళ్లాలి.

3. రైతులు తమ పంట ఉత్పత్తులు వర్షానికి తడవకుండా, పాడవకుండా భద్రమైన షెడ్లు లేదా కవర్లలో భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఊహించని పని చేసిన బాబు | Vangaveeti Radha Meets CM Chandrababu | Asianet News Telugu
Recommended image2
AP Localbody Elections 2026 : ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్లు షురూ... పూర్తి షెడ్యూల్ ఇదే
Recommended image3
Now Playing
Interesting Scene Between IPS Vishal Gunni And CM Chandrababu | Asianet Telugu
Related Stories
Recommended image1
India vs Pakistan: ఆసియా గేమ్స్ 2026 హైవోల్టేజ్ ఫైనల్.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి గోల్డ్ గెలిచిన భారత్
Recommended image2
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే.. ఈ తప్పులే కొంపముంచాయి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved