MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs WI: భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే.. ఈ తప్పులే కొంపముంచాయి !

IND vs WI: భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే.. ఈ తప్పులే కొంపముంచాయి !

India vs West Indies: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఛండీగఢ్‌లోని పీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 351 పరుగులు చేసినా ఎందుకు ఓడిపోయిందో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 04 2026, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్యాచ్‌లు నేలపాలు.. డెత్ ఓవర్ల డిజాస్టర్.. భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Image Credit : ANI

క్యాచ్‌లు నేలపాలు.. డెత్ ఓవర్ల డిజాస్టర్.. భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే

ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగం డెత్ ఓవర్లలో తీవ్రంగా తడబడింది. మ్యాచ్‌పై పట్టు సాధించే సమయంలో యార్కర్లు వేయలేక, సరైన లైన్ అండ్ లెంగ్త్ కొనసాగించలేక పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా అన్షుల్ కంబోజ్ వేసిన 48వ ఓవర్‌లో ఒకే నో బాల్ సహా ఏకంగా 22 పరుగులు రావడం వెస్టిండీస్ విజయానికి మార్గం సుగమం చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో అటాక్ చేయాలా లేదా డిఫెండ్ చేయాలా అనే విషయంలో క్లారిటీ లేకపోవడమే బౌలింగ్ లోపానికి కారణమని అంగీకరించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫీల్డింగ్ లోపాలు, జారవిడిచిన క్యాచ్‌లు
Image Credit : ANI

ఫీల్డింగ్ లోపాలు, జారవిడిచిన క్యాచ్‌లు

క్రికెట్‌లో "క్యాచ్‌లు పడితేనే మ్యాచ్‌లు గెలుస్తారు" అనే సామెతను ఈ మ్యాచ్‌లో భారత్ మరచిపోయింది. ఈ సిరీస్ పొడవునా ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. మూడో వన్డేలోనే భారత ఫీల్డర్లు మూడు సులువైన క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా తొమ్మిది క్యాచ్‌లు వదిలేశాయి. ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న వేళ ఈ తరహా ఫీల్డింగ్ లోపాలు జట్టుకు పెద్ద ముప్పుగా మారనున్నాయని, తమ ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగవ్వాలని గిల్ స్పష్టం చేశాడు.

35
మంచు ప్రభావం, స్లో ఓవర్ రేట్ పెనాల్టీ
Image Credit : ANI

మంచు ప్రభావం, స్లో ఓవర్ రేట్ పెనాల్టీ

మ్యాచ్ రెండవ భాగంలో పడిన భారీ మంచు భారత బౌలర్లకు పెద్ద శాపంగా మారింది. తడి బంతితో స్పిన్నర్లు, పేసర్లు లైన్ అండ్ లెంగ్త్ నియంత్రించడంలో ఇబ్బంది పడ్డారు. దీనికితోడు భారత్ నిర్దేశిత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో స్లో ఓవర్ రేట్ పెనాల్టీ పడింది. దీంతో చివరి ఓవర్లలో ముప్పై గజాల సర్కిల్ వెలుపల ఐదుగురు ఫీల్డర్లకు బదులుగా కేవలం నలుగురిని మాత్రమే ఉంచాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని హోప్ పూర్తిగా అనుకూలంగా మార్చుకుని బౌండరీలు బాదాడు.

45
హోప్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. బిగ్ పార్ట్‌నర్‌షిప్‌లు
Image Credit : Asianet News

హోప్ కెప్టెన్సీ ఇన్నింగ్స్.. బిగ్ పార్ట్‌నర్‌షిప్‌లు

విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఓపెనర్‌గా వచ్చి 143 బంతుల్లో 162 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్ ఆల్‌టైమ్ రికార్డ్ ఛేజింగ్‌కు ప్రాణం పోశాడు. తొడ నొప్పితో బాధపడుతున్నప్పటికీ మైదానంలో పట్టుదలతో నిలబడ్డాడు. ఎంఎస్ ధోనీ తనకు ఇచ్చిన "నీకు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం ఉంటుంది, ప్రాసెస్‌పై దృష్టి పెట్టు" అనే సలహాను గుర్తుచేసుకుంటూ ఇన్నింగ్స్‌ను కొనసాగించినట్టు హోప్ తెలిపాడు. అమెర్ జాంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, కీమో పాల్ (44), గుడాకేష్ మోటీ (19*) లతో కలిసి చిన్న చిన్న విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.

55
భారత ఇన్నింగ్స్‌‌లో కీలక వికెట్లు త్వరగా కోల్పోవడం
Image Credit : ANI

భారత ఇన్నింగ్స్‌‌లో కీలక వికెట్లు త్వరగా కోల్పోవడం

తొలి రెండు వన్డేల్లో మంచి ఇన్నింగ్స్ లు ఆడిన శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలు ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. రోహిత్ శర్మ 92 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు, కేఎల్ రాహుల్ అద్భుతమైన నాటౌట్ 129 పరుగులతో రాణించి జట్టు స్కోరును 351/7 కి తీసుకెళ్లారు. అయితే, ఇంకా పెద్ద స్కోరు సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ క్రమమైన వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో భారత్ 370-380 మార్కును అందుకోలేకపోయింది. ఈ చిన్న వ్యత్యాసమే విండీస్‌‌కు విజయాన్ని అందించింది.

మ్యాచ్ స్కోరు వివరాలు:

• భారత్: 351/7 (50 ఓవర్లు) - కేఎల్ రాహుల్ 129*, రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57.

• వెస్టిండీస్: 352/5 (48.2 ఓవర్లు) - షై హోప్ 162*, కీమో పాల్ 44, అమెర్ జాంగూ 52.

• ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షాయ్ హోప్ (162*)

• ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: శుభ్‌మన్ గిల్ (334 పరుగులు)

వన్డే సిరీస్ ముగిసిన నేపథ్యంలో భారత్, వెస్టిండీస్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ మంగళవారం (అక్టోబర్ 6) నుండి ప్రారంభం కానుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs WI: వెస్టిండిస్ సంచ‌ల‌న విజ‌యం.. చివ‌రి వ‌న్డేలో చెల‌రేగిన హోప్ సేన
Recommended image2
రోహిత్ శర్మ మ‌రో అరుదైన ఘనత.. సచిన్ రికార్డును అందుకున్న హిట్‌మ్యాన్
Recommended image3
Tilak Varma: తిలక్ వర్మ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. 22 బంతుల్లోనే తెలుగోడి మాస్ విధ్వంసం
Related Stories
Recommended image1
India vs Pakistan: ఆసియా గేమ్స్ 2026 హైవోల్టేజ్ ఫైనల్.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి గోల్డ్ గెలిచిన భారత్
Recommended image2
Tilak Varma: తిలక్ వర్మ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. 22 బంతుల్లోనే తెలుగోడి మాస్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved