- Home
- Andhra Pradesh
- Tirupati: వేంకటేశ్వర స్వామికి భక్తుడి భారీ విరాళం.. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలు
Tirupati: వేంకటేశ్వర స్వామికి భక్తుడి భారీ విరాళం.. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలు
Tirupati: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందించబోతున్నారు. 150 నుంచి 160 కోట్ల రూపాయల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించనున్నారు. తిరుమల చరిత్రలోనే ఓ వ్యక్తిగత భక్తుడు ఇస్తున్న అతిపెద్ద కానుక ఇదే.

తిరుమలేశుడికి 121 కిలోల బంగారం విరాళం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి నిత్యం భక్తులు విరాళాలు అందిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఓ భక్తుడు ఏకంగా 150 నుంచి 160 కోట్ల రూపాయల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించనున్నారు. తిరుమల చరిత్రలోనే ఓ వ్యక్తిగత భక్తుడు ఇస్తున్న అతిపెద్ద విరాళం ఇది.
మొత్తం 121 కిలోల బరువున్న బంగారాన్ని 9 సెట్లలో 45 రకాల ఆభరణాలుగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ బంగారు ఆభరణాల మొత్తం విలువ సుమారు 150 కోట్ల నుంచి 160 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
బంగారు కానుకను ఎప్పుడు అందిస్తారు?
దాత ఇప్పటికే టీటీడీ అధికారులతో చర్చించి అన్ని లాంఛనాలు పూర్తి చేశారు. స్వామి వారికి కావాల్సిన ఆభరణాలు ప్రత్యేకంగా చేయించారు. వాటిని నవంబర్ 26న ఆలయంలో అధికారికంగా అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా వీటిని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో కోసం నవంబర్ 26న చంద్రబాబు నాయుడు తిరుల వెళ్లనున్నారు.
గత ఏడాది 2025 ఆగస్టులో తన కంపెనీ షేర్ల అమ్మకం విజయవంతమైతే శ్రీవారికి 121 కిలోల బంగారం ఇస్తానని మొక్కుకున్నారు ఈ వ్యాపారవేత్త. షేర్ల అమ్మకాలు పూర్తవ్వడంతో పాటూ భారీగా లాభాలు కూడా రావడంతో ఆ భక్తుడు మొక్కు తీర్చుకోబోతున్నారు. స్వామివారు ప్రతిరోజూ 120 కిలోల బంగారు ఆభరణాలు ధరిస్తారు. అందుకు ఆ భక్తులు కూడా 121 కిలోల ఆభరణాలను తయారు చేయించారు.















