MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం.. ఐఎండీ తీవ్ర తుపాను అలర్ట్

Weather Update: బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం.. ఐఎండీ తీవ్ర తుపాను అలర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వర్షాలతో భిన్న వాతావరణం నెలకొంది. అయితే, మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పై వాయుగండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ తెలిపిన తుపాను అలర్ట్ వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 02 2026, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయో తెలుసా?
Image Credit : Gemini

ఏపీ, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ప్రస్తుతం చాలా డిఫరెంట్‌గా మారింది. సాధారణంగా ఈ టైమ్‌లో చలి మెల్లగా స్టార్ట్ అవ్వాలి, కానీ సీన్ రివర్స్ అయింది. ఉదయమంతా ఎండ దంచికొడుతుంటే, మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఇటీవల ఏర్పడిన వాయుగుండం తగ్గుముఖం పట్టాక, ఏపీ, తెలంగాణలో విపరీతమైన ఉక్కపోత, పొడి వాతావరణం నెలకొంది. అయితే, భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులిటెన్ ప్రకారం అక్టోబర్ 2 నుంచి 5 వరకు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తమిళనాడు ఉపరితల ఆవర్తనం, కర్ణాటక ద్రోణి ప్రభావం
Image Credit : gemini

తమిళనాడు ఉపరితల ఆవర్తనం, కర్ణాటక ద్రోణి ప్రభావం

వాతావరణంలో ఈ మార్పులకు ప్రధాన కారణం ఉత్తర కోస్తా తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనమే. దీనికి తోడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి మన్నార్ గల్ఫ్ వరకు తమిళనాడు మీదుగా ఒక ద్రోణి కూడా విస్తరించి ఉంది.

వీటన్నింటి ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాం కూడా ఉందని ఐఎండీ తెలిపింది.

35
తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వర్షాలు
Image Credit : Asianet News

తెలంగాణలో మళ్లీ దంచికొట్టనున్న వర్షాలు

ఇక తెలంగాణ విషయానికి వస్తే, గత వారం వర్షాలు బాగానే కురిసినా, ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఎండలు షురూ అయ్యాయి. ఖమ్మంలో గరిష్ఠంగా 37.2 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అయింది. అయితే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మేఘావృతమై జల్లులు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా అక్టోబర్ 4, 5 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, భీకర గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.

45
ఎల్‌నినో దెబ్బ: ఈసారి చలి తక్కువే, డెఫిసిట్ రైన్ ప్యాటర్న్
Image Credit : Gemini

ఎల్‌నినో దెబ్బ: ఈసారి చలి తక్కువే, డెఫిసిట్ రైన్ ప్యాటర్న్

ఈసారి వర్షాకాలంలో నైరుతి రుతుపవనాలు అనుకున్నంతగా కురిపించలేదు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డేటా ప్రకారం, సాధారణ వర్షపాతం 589.7 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, కేవలం 383.6 మి.మీ మాత్రమే పడింది. ఏకంగా 34.9% లోటు వర్షపాతం రికార్డైంది. అన్నమయ్య జిల్లాలో తీవ్ర లోటు ఉండగా, 20 జిల్లాల్లో మిగతా లోటు కనిపించింది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి అక్టోబర్‌లోనూ వర్షాలు పెద్దగా ఉండకపోవచ్చని, రాబోయే శీతాకాలంలో చలి తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుందని క్లైమేట్ నిపుణులు చెప్తున్నారు.

55
అక్టోబర్ 13 తర్వాత బంగాళాఖాతంలో తుపాను గండం?
Image Credit : Gemini

అక్టోబర్ 13 తర్వాత బంగాళాఖాతంలో తుపాను గండం?

అక్టోబర్ 12 నాటికి థాయ్‌లాండ్ పరిసరాల నుంచి ఉత్తర అండమాన్ సముద్రంలోకి ఒక ఉపరితల ఆవర్తనం ప్రవేశించనుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 13న అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి, ఆ తర్వాత అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తీవ్రరూపం దాల్చే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఇది తుపానుగా మారి ఒడిశా వైపు వెళ్తుందా లేక కోస్తాంధ్రపై ప్రభావం చూపుతుందా అనే దానిపై ఐఎండీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు కానీ, ఒడిశా, ఏపీ తీర ప్రాంతాలకు వర్ష ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
డ్వాక్రా మహిళ షాపుకు వెళ్లిన సీఎం.. బిజినెస్ ఐడియా విని ఫిదా | CM Chandrababu meets Dwacra womens
Recommended image2
వారంలో 6 రోజులు కోడిగుడ్లు, 3 రోజులు చికెన్‌.. విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్
Recommended image3
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు.. కూట‌మి ప్ర‌భుత్వం నెక్ట్స్ స్టెప్ ఏంటంటే.?
Related Stories
Recommended image1
Indian ODI Double Centuries: వన్డేల్లో 8 డబుల్ సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు
Recommended image2
Beer vs Wine: బీరు vs వైన్.. తేడాలు ఏంటి? ఈ రెండింటిలో బాడీకి ఏది మంచిది? అసలు మేటర్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved