MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు.. కూట‌మి ప్ర‌భుత్వం నెక్ట్స్ స్టెప్ ఏంటంటే.?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు.. కూట‌మి ప్ర‌భుత్వం నెక్ట్స్ స్టెప్ ఏంటంటే.?

Andhra pradesh:ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెలకొన్న అనిశ్చితికి హైకోర్టు తీర్పుతో కీలక మలుపు వచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్లు 105, 1065ను హైకోర్టు రద్దు చేసింది

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 01 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
34 శాతం బీసీ కోటాపై హైకోర్టు కీలక తీర్పు
Image Credit : Asianet News

34 శాతం బీసీ కోటాపై హైకోర్టు కీలక తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి కేటాయించే కోటా 50 శాతాన్ని మించే అవకాశం ఉందని పిటిషనర్లు వాదించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి నిర్దేశించిన న్యాయ ప్రమాణాలను కూడా వారు ప్రస్తావించారు. విచారణ అనంతరం ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన సంబంధిత జీవోలను రద్దు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం
Image Credit : X

ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం

బీసీ రిజర్వేషన్లపై జీవోలు రద్దు చేసినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల మొత్తం ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించలేదు. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేసింది. దీంతో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలపై తదుపరి చర్యలకు అవకాశం ఏర్పడింది. ఎన్నికల నిర్వహణకు ముందు అవసరమైన ప్రక్రియలను అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

35
పునర్విభజన, సర్వే అంశాలపై పిటిషన్లు తిరస్కరణ
Image Credit : our own

పునర్విభజన, సర్వే అంశాలపై పిటిషన్లు తిరస్కరణ

స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపడి ఉన్న వార్డుల పునర్విభజన, సర్వే ప్రక్రియ, బీసీ జనాభా వివరాలు తదితర అంశాలపై కూడా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరిన వాదనలకు హైకోర్టు ఆమోదం తెలపలేదు. బీసీ జనాభా గణన పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలన్న అభ్యర్థనను కూడా కోర్టు అంగీకరించలేదు. వార్డుల పునర్విభజన ప్రక్రియలో ఈ దశలో జోక్యం చేసుకోవడానికి కూడా ధర్మాసనం నిరాకరించినట్లు స‌మాచారం.

45
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం
Image Credit : Asianet News

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన చర్యలపై దృష్టి పెట్టింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు సీనియర్ న్యాయ నిపుణులతో సీఎం చర్చించినట్లు సమాచారం. వచ్చే సోమవారంలోపు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

55
50 శాతం పరిమితిలో బీసీ రిజర్వేషన్లకు కొత్త మార్గం ఏంటి?
Image Credit : Twitter

50 శాతం పరిమితిలో బీసీ రిజర్వేషన్లకు కొత్త మార్గం ఏంటి?

ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం ముందున్న అంశం బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్నదే. ఒకవైపు హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. మరోవైపు 34 శాతం బీసీ కోటాపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో తదుపరి న్యాయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం చేసే వాదనలు, అక్కడ వెలువడే ఆదేశాలను బట్టి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు తీరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
రాజకీయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
స్పీచ్ తో రఫ్ఫాడించిన బాబు | CM Chandrababu Full Speech At Repalle Meeting | Asianet Telugu
Recommended image2
Now Playing
నిండు సభలో జగన్ ని ఓ ఆటాడుకున్న బాబు | Chandrababu Repalle Speech | Asianet Telugu
Recommended image3
Now Playing
లైవ్ లో అధికారిని సస్పెండ్ చేసిన బాబు | Chandrababu Meeting Repalle | Asianet Telugu
Related Stories
Recommended image1
వ‌ర్షాకాలంలో క‌నిపించే ఈ పురుగులు ఏంటో తెలుసా? వీటిని తాకితే ఏమ‌వుతుంది.?
Recommended image2
స‌ముద్రాలు ఒక్క‌సారిగా మంచినీటిగా మారితే ఏమ‌వుతుందో తెలుసా.? విప‌త్తు ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved