MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వారమైనా దొర‌క‌ని జ్ఞానేశ్వ‌రి ఆచుకీ.. అస‌లేం జ‌రుగుతోంది? పెంపుడు కుక్క ఎందుకు మ‌ర‌ణించింది?

వారమైనా దొర‌క‌ని జ్ఞానేశ్వ‌రి ఆచుకీ.. అస‌లేం జ‌రుగుతోంది? పెంపుడు కుక్క ఎందుకు మ‌ర‌ణించింది?

Jnaneshwari Missing: కాకినాడ జిల్లా తుని మండలంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతోంది. వారం రోజులుగా పోలీసులు, ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 13 2026, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పామాయిల్ తోట నుంచి అదృశ్యమైన చిన్నారి
Image Credit : Asianet News

పామాయిల్ తోట నుంచి అదృశ్యమైన చిన్నారి

తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారం సమీపంలో గణేష్, భవాని దంపతులు పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారు తమ రెండేళ్ల కుమార్తె జ్ఞానేశ్వరితో కలిసి అక్కడే నివసిస్తున్నారు. జూన్ 6న మధ్యాహ్నం సమయంలో చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించింది. అదే సమయంలో కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా ఆమె వెంట ఉన్నట్లు సమాచారం. కొద్దిసేపటికే పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
15 నిమిషాల వ్యవధిలో మాయమైన పాప.. మిస్టరీగా మారిన ఘటన
Image Credit : Asianet News

15 నిమిషాల వ్యవధిలో మాయమైన పాప.. మిస్టరీగా మారిన ఘటన

దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం, పాప తండ్రి వైపు వెళ్తున్నట్లు ఒక స్థానిక యువకుడు గమనించినట్లు తెలుస్తోంది. అయితే చిన్నారి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పెంపుడు కుక్క అతడిని అడ్డుకున్నట్లు సమాచారం. ఆ యువకుడు గ్రామానికి వెళ్లి విషయం చెప్పి తిరిగి వచ్చేసరికి పాప, కుక్క రెండూ అక్కడ కనిపించలేదని చెబుతున్నారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు కేసులో అత్యంత కీలక అంశంగా మారింది. ఆ సమయంలో అసలు ఏం జరిగిందనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.

Related Articles

Related image1
Facts: అమెరికాలో ఇళ్ల‌పై నీటి ట్యాంకులు ఎందుకు క‌నిపించ‌వో తెలుసా.?
Related image2
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
35
డ్రోన్లు, ప్రత్యేక బలగాలు.. భారీ గాలింపు చర్యలు
Image Credit : Asianet News

డ్రోన్లు, ప్రత్యేక బలగాలు.. భారీ గాలింపు చర్యలు

చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృత స్థాయిలో సెర్చింగ్‌ చేపట్టారు. పామాయిల్ తోటతో పాటు సమీపంలోని అటవీ ప్రాంతాలు, కొండలు, బోరు బావులు, చెరువులు, పొదలు అన్నింటినీ జల్లెడ పట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలు, డ్రోన్ కెమెరాలు, సాంకేతిక పరికరాల సహాయంతో వారం రోజులుగా గాలింపు కొనసాగుతోంది. తోటలోని ఇనుప కంచె సమీపంలో చిన్నారి వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు లభించాయని సమాచారం. అక్కడి నుంచి కొన్ని ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది.

45
జీపీఎస్ ట్రాకర్ అమర్చిన కుక్క మృతి.. పెరిగిన అనుమానాలు
Image Credit : Asianet News

జీపీఎస్ ట్రాకర్ అమర్చిన కుక్క మృతి.. పెరిగిన అనుమానాలు

చిన్నారి అదృశ్యమైన మూడు రోజుల తర్వాత ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో పోలీసులు దానిని కీలక ఆధారంగా భావించారు. కుక్క కదలికలను గమనించేందుకు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. మళ్లీ అది వెళ్లే మార్గాన్ని పరిశీలిస్తే చిన్నారి ఆచూకీ లభించవచ్చని ఆశించారు. అయితే ఆశించిన విధంగా ఎలాంటి సమాచారం లభించలేదు. ఇదే సమయంలో కుక్క ఆరోగ్యం క్షీణించడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందించారు. కానీ అది అనారోగ్యంతో మృతి చెందింది. ఈ పరిణామం కేసులో కొత్త అనుమానాలకు దారితీసింది.

55
కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు.. అన్ని మార్గాల్లో విచారణ
Image Credit : Asianet News

కిడ్నాప్ కోణంలోనూ దర్యాప్తు.. అన్ని మార్గాల్లో విచారణ

చిన్నారి ఇప్పటికీ దొరకకపోవడంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా విచారణను వేగవంతం చేశారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత పరిచయాలు, గత విభేదాలు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, మొబైల్ టవర్ డేటా, కాల్ రికార్డులను విశ్లేషిస్తున్నారు. చిన్నారి తండ్రికి గతంలో కొందరితో విభేదాలు ఉన్నాయనే సమాచారం నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. వారం రోజులు గడిచినా ఎలాంటి స్పష్టమైన ఆధారం దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి సురక్షితంగా దొరకాలని స్థానికులు ప్రార్థిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : చురుగ్గా రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఆవర్తనం, అరేబియాలో ద్రోణి.. ఈ వీకెండ్ వర్ష బీభత్సమే..!
Recommended image2
Now Playing
Roja vs Pawan Kalyan: OG కాదు పెద్ద క్యాబేజిపవన్ పై రోజా సెటైర్లు | Asianet News Telugu
Recommended image3
Flash Flood Alert : క్షణాల్లో కుంభవృష్టి.. ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్, అతలాకుతలం తప్పేలా లేదుగా
Related Stories
Recommended image1
Facts: అమెరికాలో ఇళ్ల‌పై నీటి ట్యాంకులు ఎందుకు క‌నిపించ‌వో తెలుసా.?
Recommended image2
దేశంలో పెరుగుతోన్న వివాహేత‌ర సంబంధాలు.. హైద‌రాబాద్ స్థానం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved