MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Heavy Rain Alert : చురుగ్గా రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఆవర్తనం, అరేబియాలో ద్రోణి.. ఈ వీకెండ్ వర్ష బీభత్సమే..!

Heavy Rain Alert : చురుగ్గా రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఆవర్తనం, అరేబియాలో ద్రోణి.. ఈ వీకెండ్ వర్ష బీభత్సమే..!

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి… ఈ వీక్ లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇలాంటి వర్షాలే ఈ వీకెండ్ కూడా కొనసాగే అవకాశాలున్నాయని వాాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.  

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 13 2026, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు
Image Credit : X/APSDMA

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి... ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటన్నింటి ప్రభావంతో ఈ వీకెండ్ (జూన్ 13, 14 శని, ఆదివారం) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నేడు తెలంగాణలో భారీ వర్షాలు...
Image Credit : Gemini

నేడు తెలంగాణలో భారీ వర్షాలు...

ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. ఈ రెండ్రోజులు (శని, ఆదివారం) కూడా జోరువానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. శుక్రవారం రాత్రి నుండి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ (శనివారం) ఉదయం కూడా ఈ వర్షబీభత్సం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు.

జోగులాంబ గద్వాల, వరపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి... ఇవి శనివారం ఉదయం కూడా కంటిన్యూ అవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రాజధాని హైదరాబాద్ లో ఆకాశం మేఘాలతో కమ్మేసి చల్లగా, ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుందని... అక్కడక్కడ చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షాలేమీ ఉండవని వెదర్ మ్యాన్ తెలిపారు.

Related Articles

Related image1
Now Playing
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలంగామారనున్న వాతావరణం | Heavy Rains
Related image2
Heavy Rains : సాయంత్రం ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు... రెడ్ అలర్ట్, ఇక అల్లకల్లోలమే..!
34
ఈ తెలంగాణ జిల్లాలకు హైఅలర్ట్..
Image Credit : Gemini AI

ఈ తెలంగాణ జిల్లాలకు హైఅలర్ట్..

ఇవాళ (జూన్ 13, శనివారం) భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్,వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురు జల్లులు ఉంటాయని హెచ్చరించింది.

44
నేడు ఏపీలోనూ వర్ష బీభత్సమే.. .
Image Credit : Gemini AI

నేడు ఏపీలోనూ వర్ష బీభత్సమే.. .

దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని... ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
KCR : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారు సరే.. ఇంతకీ కేసీఆర్ వెళతారా, లేదా?
Recommended image2
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image3
Now Playing
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
Related Stories
Recommended image1
Now Playing
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలంగామారనున్న వాతావరణం | Heavy Rains
Recommended image2
Heavy Rains : సాయంత్రం ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు... రెడ్ అలర్ట్, ఇక అల్లకల్లోలమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved