MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Flash Flood Alert : క్షణాల్లో కుంభవృష్టి.. ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్, ఈ రాత్రి అతలాకుతలం తప్పేలా లేదుగా

Flash Flood Alert : క్షణాల్లో కుంభవృష్టి.. ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్, ఈ రాత్రి అతలాకుతలం తప్పేలా లేదుగా

IMD Heavy Rain Alert : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరువానలు కురుస్తున్నాయి. ఈ రాత్రి నుండి రేపు (శనివారం) ఉదయం వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట… కొన్ని పట్టణాలకు ప్లాష్ ప్లడ్స్ ప్రమాదం పొంచివుందట.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 12 2026, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు..
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు..

Heavy Rain Alert : కాస్త ఆలస్యం అయినా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి. జూన్ ఫస్ట్ వీక్ లో మెళ్ళిగా ప్రారంభమైన వర్షాలు సెకండ్ వీక్ లో జోరందుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం బీభత్సం సృష్టించింది. తాజాగా పరిస్థితులు వర్షాలకు మరింత అనుకూలంగా మారాయి... దీంతో తెలంగాణలో ఈ రాత్రి (శుక్రవారం) నుండి రేపు (శనివారం) ఉదయం భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
 తెలంగాణలో ప్లాష్ ప్లడ్స్ తప్పవా..?
Image Credit : Getty

తెలంగాణలో ప్లాష్ ప్లడ్స్ తప్పవా..?

మరికొద్దిసేపట్లో తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలను వర్షం ముంచెత్తే అవకాశాలున్నాయని తెలిపారు... అతి తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదై ప్లాష్ ప్లడ్స్ వచ్చే ఛాన్సెన్స్ ఉన్నాయని హెచ్చరించారు. సంగెం, నెక్కొండ, ములుగు, పరకాల ప్రాంతాల్లోనూ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు రాత్రి జాగ్రత్తగా ఉండాలని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు.

HEAVY RAIN ALERT FOR WARANGAL TRICITIES

A MASSIVE DOWNPOUR from Sangem, Nekkonda, Mulugu, Parkal is expected to cover entire Warangal, Hanmakonda, Kazipet tricities in next 2hrs along with Madikonda, Hasanparthy. 

STAY ALERT, heavy waterlogging expected as HEAVY RAINFALL…

— Telangana Weatherman (@balaji25_t) June 12, 2026

Related Articles

Related image1
Now Playing
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలంగామారనున్న వాతావరణం | Heavy Rains
Related image2
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే
36
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైఅలెర్ట్...
Image Credit : Getty

హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైఅలెర్ట్...

మరికొద్దిసేపట్లో ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఇక హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయట... అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

46
శనివారం తెలంగాణలో వర్షాలే వర్షాలు..
Image Credit : Getty

శనివారం తెలంగాణలో వర్షాలే వర్షాలు..

రేపు (జూన్ 13, శనివారం) భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్,వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురు జల్లులు ఉంటాయని హెచ్చరించింది.

56
తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్...
Image Credit : ANI

తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్...

ఓవైపు వర్షాలు మొదలైనా మరోవైపు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇవాళ (జూన్ 12, శుక్రవారం) అత్యధికంగా ఆదిలాబాద్ లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్ లో 41.7, రామగుండంలో 41.5, హన్మకొండలో 40.5, ఖమ్మంలో 40.2, నల్గొండలొ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అత్యధికంగా హయత్ నగర్ లో 38.6 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. పటాన్ చెరులో 38.4, బేగంపేటలో 38.4, హకీంపేటలో 38.1. రాజేంద్ర నగర్ లో 38 డిగ్రీల ఉష్ఱోగ్రతలున్నాయి.

66
శనివారం ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలే వర్షాలు..
Image Credit : Gemini

శనివారం ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలే వర్షాలు..

దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం (జూన్ 13న) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని... ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాదీలు ఊపిరి పీల్చుకోండి.. ట్రాఫిక్ న‌ర‌కానికి విముక్తి ప‌లుకుతూ కొత్త ఫ్లైఓవ‌ర్, ఎక్క‌డంటే.?
Recommended image2
Holidays : ఒకటి రెండ్రోజులు కాదు గురూ.. వరుసగా నాల్రోజులు సెలవులు, లాంగ్ వీకెండ్ రెడీ
Recommended image3
Weather Update: ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ.. మరోవైపు 42 డిగ్రీల ఎండలు !
Related Stories
Recommended image1
Now Playing
Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలంగామారనున్న వాతావరణం | Heavy Rains
Recommended image2
IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved