MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Andhra Pradesh
  • Rain Alert: తెలుగు రాష్ట్రాల‌పై ద్రోణి ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షం, జాగ్ర‌త్త

Rain Alert: తెలుగు రాష్ట్రాల‌పై ద్రోణి ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షం, జాగ్ర‌త్త

Rain Alert: తెల‌గు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో బుధ‌వారం (ఈరోజు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 18 2026, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ జిల్లాల్లో ఎక్కడ ఎక్కువ ప్రభావం?
Image Credit : Gemini AI

ఏపీ జిల్లాల్లో ఎక్కడ ఎక్కువ ప్రభావం?

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన ఈ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రంగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇప్పటికే రాయలసీమలో మబ్బులు కమ్ముకున్నాయి. అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణలోనూ మారిన వాతావరణం
Image Credit : istock

తెలంగాణలోనూ మారిన వాతావరణం

తెలంగాణలో కూడా వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అర్థరాత్రి నుంచి పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడుతోంది. కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Related Articles

Related image1
హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎంత ధ‌ర ఉందంటే..
Related image2
Do you Know: 90 శాతం మందికి ఇవేంటో తెలియ‌దు.. ఇంత‌కీ స్టీల్ ప‌రికరం ఉప‌యోగం ఏంటంటే?
35
నాలుగు రోజులపాటు కొనసాగనున్న వర్షాలు
Image Credit : Gemini AI

నాలుగు రోజులపాటు కొనసాగనున్న వర్షాలు

కర్ణాటక, తమిళనాడు వైపు నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశముంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

45
హైదరాబాద్‌పై ప్రభావం
Image Credit : Asianet News

హైదరాబాద్‌పై ప్రభావం

దక్షిణ హైదరాబాద్‌పై భారీ వర్ష మేఘాలు కమ్ముకున్నాయి. మహేశ్వరం, షాద్ నగర్ వైపు నుంచి వచ్చిన ఈ మేఘాలు నగరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.

55
ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Getty

ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిల‌బ‌డ‌కూడ‌దు. విద్యుత్ స్తంభాలు, ఓపెన్ ప్రదేశాల దగ్గర ఉండకూడదు. బలమైన గాలుల వల్ల చెట్లు, హోర్డింగ్స్ పడే ప్రమాదం ఉంది. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలి. రైతులు కోతకు సిద్ధమైన పంటలు, ఆరబోసిన ధాన్యం రక్షించాలి. మరోవైపు వాయుగుండం ప్రభావంతో వచ్చే ఆరు రోజులపాటు కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా కొంతవరకు తగ్గే అవకాశముంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
“డీఎస్సీ అమ్ముకున్నారు”.. Call Record బయటపెట్టిన జగన్ | YS Jagan Pressmeet | AP Politics
Recommended image2
Now Playing
అందుకే ప్రతిపక్షం లేకుండానే సభ నడుపుతున్నారు | Jagan Comments on CM Chandrababu
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. దూసుకొస్తున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వానలే వానలు
Related Stories
Recommended image1
హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఎంత ధ‌ర ఉందంటే..
Recommended image2
Do you Know: 90 శాతం మందికి ఇవేంటో తెలియ‌దు.. ఇంత‌కీ స్టీల్ ప‌రికరం ఉప‌యోగం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved