- Home
- Andhra Pradesh
- Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Government Job 2026 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు… అదికూడా కేవలం దక్షిణాది రాష్ట్రాల యువతకే. ఇంకెందకు ఆలస్యం… అన్ని అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి. జాబ్ కొట్టండి.

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల భర్తీ
NLC ఇండియా లిమిటెడ్ లో 575 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ అప్రెంటిస్ శిక్షణ కాలం ఒక సంవత్సరం. అర్హులైన అభ్యర్థులు 19.12.2025 ఉదయం 10:00 గంటల నుంచి 02.01.2026 సాయంత్రం 5:00 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ www.nlcindia.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హత నిబంధనలను చూసుకోవడం ముఖ్యం.
విద్యా అర్హతలు
ఈ రిక్రూట్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్, ECE, IT లాంటి ఇంజనీరింగ్ విభాగాల్లో చాలా పోస్టులు ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్, CSE, ECE విభాగాలతో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, క్యాటరింగ్ టెక్నాలజీ & హోటల్ మేనేజ్‌మెంట్, ఫార్మసిస్ట్ లాంటి డిప్లొమా అర్హత ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి.
తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఫుల్-టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఫుల్-టైమ్ డిప్లొమా అర్హత అవసరం. అభ్యర్థులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అయి ఉండాలి. 2021 నుంచి 2025 మధ్య అర్హత పరీక్ష పాసైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం ఉంటుంది.
శాలరీ, ఎంపిక ప్రక్రియ
జీతంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు – రూ.15,028/-, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు – రూ.12,524/- ఇస్తారు. ఎంపిక ప్రక్రియ మెరిట్ లిస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేశాక, అప్‌లోడ్ చేసిన అప్లికేషన్ మీద సంతకం పెట్టిన ప్రింట్ అవుట్, అవసరమైన సెల్ఫ్-అటెస్టెడ్ కాపీలతో పాటు 09.01.2026 సాయంత్రం 5:00 గంటలలోపు లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, NLC ఇండియా లిమిటెడ్, నైవేలి అనే చిరునామాకు నేరుగా లేదా పోస్ట్ ద్వారా పంపాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం – 19.12.2025
చివరి తేదీ – 02.01.2026
హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ – 09.01.2026
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచేవారి జాబితా విడుదల – 17.01.2026
సర్టిఫికేట్ వెరిఫికేషన్ – 21.01.2026 నుంచి 23.01.2026 వరకు
తాత్కాలిక ఎంపిక జాబితా – 04.02.2026
శిక్షణలో చేరే తేదీ – గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 10.02.2026
టెక్నీషియన్ అప్రెంటిస్: 16.02.2026.
NLC రిక్రూట్‌మెంట్ 2026 గురించిన అన్ని అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు చూస్తూ ఉండటం ముఖ్యం.

