MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: మళ్లీ ముంచుకొస్తున్న ముప్పు.. భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Weather Update: మళ్లీ ముంచుకొస్తున్న ముప్పు.. భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 06 2026, 08:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగాళాఖాతంలో ఆవర్తనం
Image Credit : chatgpt

బంగాళాఖాతంలో ఆవర్తనం

ఇప్పటికే పలు తుపాన్ల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

దీపావళి పండగ తర్వాత ఈ ఆవర్తనం బలపడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సముద్రంలో అల్పపీడనం ఏర్పడి, అది మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడ్రోజుల పాటు వాతావరణం మారుతుందని, పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏపీలో భారీ వర్షాల హెచ్చరికలు
Image Credit : Gemini

ఏపీలో భారీ వర్షాల హెచ్చరికలు

అర్నబ్, మురసు తుపాన్ల కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోవడంతో పాటు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ తుపాన్ల ప్రభావం ఇంకా పూర్తిగా ముగియకముందే, తాజాగా ఏర్పడనున్న ఆవర్తనం కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది.

అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.

34
తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ
Image Credit : Gemini

తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గడ్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

44
చలిగాలుల ప్రభావం.. పొడి వాతావరణం
Image Credit : Gemini

చలిగాలుల ప్రభావం.. పొడి వాతావరణం

ఒకవైపు వర్ష సూచనలు ఉండగానే, మరోవైపు తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో శీతాకాల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత ఎక్కువవుతోంది.

ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నందున రహదారులపై ప్రయాణించే వాహనదారులు స్లో డ్రైవింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఇక రాజధాని హైదరాబాద్‌లో పగటిపూట పొడిగా, రాత్రి వేళల్లో చల్లటి ఈదురుగాలులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
హైదరాబాద్
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ స్కూల్ నిజంగానే చాలా "నైస్‌".. పేద పిల్ల‌ల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న విద్యా దీపం
Recommended image2
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి పండగే... ఈ దీపావళికి రెండ్రోజులు సెలవులే
Recommended image3
ఏపీలో ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. అవి అస‌లు ఎల‌క్షేన్సా అంటూ
Related Stories
Recommended image1
Cheapest Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వీఐ అందిస్తున్న చౌకైన వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
Recommended image2
Drinking Water Before Brushing: ఉదయం బ్రష్‌ చేయకుండా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved