- Home
- Andhra Pradesh
- School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి పండగే... ఈ దీపావళికి రెండ్రోజులు సెలవులే
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి పండగే... ఈ దీపావళికి రెండ్రోజులు సెలవులే
ఈసారి దీపావళి పండగ ఆదివారం రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఓ సెలవులు మిస్ అవుతున్నారు. అయితే కొందరికి మాత్రం ఈ దీపావళికి రెండ్రోజుల సెలవులు కలిసిరానున్నాయి… ఎలాగో తెలుసా?

దీపావళి సెలవులు ఎన్నిరోజులు?
Diwali Holidays : తెలుగు ప్రజలు దీపావళి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తిశ్రద్దలతో లక్ష్మీదేవి పూజ చేసుకుని, పిండివంటలు వండుకుని, స్వీట్లు పంచుకుంటూ నోరు తీపి చేసుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకుంటారు. ఇక పిల్లలు, యువత టపాసులు కాలుస్తూ చేసే ఎంజాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కుటుంబసభ్యులంతా కలిసి దీపావళి పండగపూట సందడిగా గడపుతారు.
అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దీపావళి పండక్కి ప్రభుత్వం అధికారిక సెలవు ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులన్నింటికి ఈ పండగ సెలవు వర్తిస్తుంది. కానీ ఈసారి దీపావళి పండగ ఆదివారం (నవంబర్ 8న) రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు స్పెషల్ సెలవు మిస్ అవుతున్నారు. అయితే కొందరికి మాత్రం ఈ పండక్కి రెండ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
దీపావళికి రెండ్రోజులు సెలవులే..
సాధారణ విద్యాసంస్థలు, ఉద్యోగులకు ప్రతి వీక్ ఆదివారం ఒక్కరోజే సెలవు ఉంటుంది. కానీ కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసేవారితో పాటు ఐటీ ఉద్యోగులకు వీకెండ్ రెండ్రోజులు సెలవులుంటాయి... అంటే ఆదివారంతో పాటు శనివారమూ సెలవే. ఇలాంటి ఉద్యోగులకు ఈ దీపావళి మరింత స్పెషల్ గా మారనుంది… పండక్కి ముందురోజు వీకెండ్ సెలవే కాబట్టి రెండ్రోజులు ఎంజాయ్ చేయవచ్చు. ఇలా ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు దీపావళికి (నవంబర్ 7,8) రెండ్రోజుల సెలవులు కలిసివచ్చాయి.
అయితే హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే కొన్ని స్కూల్స్ కి కూడా వీకెండ్ రెండ్రోజులు సెలవులుంటాయి. ఇలాంటి స్కూల్స్ లో చదివే విద్యార్థులకు కూడా ఈ దీపావళికి రెండ్రోజులు (శని, ఆదివారం) సెలవులు కలిసిరానున్నాయి. వీళ్లు తల్లిదండ్రులతో కలిసి రెండ్రోజులు దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకోవచ్చు.
ఈ విద్యార్థులకూ రెండ్రోజులు సెలవులే..
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది... ఇందులో భాగంగానే ఇవాళ (నవంబర్ 5, గురువారం) ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారు.
అయితే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి నవంబర్ 7న అంటే ఈ శనివారం జరగనుంది. ఓట్ల కౌంటింగ్ సెంటర్లను కూడా ప్రభుత్వ విద్యాసంస్థలు లేదంటే కార్యాలయాల్లో ఏర్పాటుచేస్తారు... కాబట్టి ఈరోజు కూడా కొందరికి సెలవు ఉంటుంది. ఇలా దీపావళికి ముందురోజు ఏపీలో కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు వస్తోంది... వీళ్లు శని, ఆదివారం రెండ్రోజులు దీపావళి వేడుకలను జరుపుకోవచ్చు.
గమనిక : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో దీపావళికి ముందురోజు అంటే నవంబర్ 7 (శనివారం) సెలవు అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే సెలవు ఉంటుంది. కాబట్టి స్కూల్ నుండి సమాచారం ఉంటేనే సెలవుగా పరిగణించాలి.





