MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఎప్ప‌టి నుంచి?

తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఎప్ప‌టి నుంచి?

Dasara Holidays: ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణలో సెప్టెంబర్ చివరి వారంలో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రెండు రాష్ట్రాల స్కూల్ హాలిడే షెడ్యూల్ భిన్నంగా ఉన్నాయి. దసరా 2025 సెలవుల పూర్తి వివ‌రాలు మీకోసం.

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 15 2025, 09:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దసరా సెలవులు ఎప్పటి నుంచి?
Image Credit : ChatGPT / AI Photo

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దసరా సెలవులు ఎప్పటి నుంచి?

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రాష్ట్రంలో దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉండనున్నాయి. మొత్తం తొమ్మిది రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేయనున్నారు. ఈ విరామం తర్వాత పాఠశాలలు తిరిగి అక్టోబర్ 3న ప్రారంభమవుతాయి.

DID YOU
KNOW
?
దసరా ప్రత్యేకత ఏమిటి?
దసరా సత్యం, ధర్మం విజయాన్ని సూచించే పండుగ. నవరాత్రుల ముగింపు రోజు శ్రీరాముడు రావణునిపై, దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని ఘనంగా జరుపుకుంటారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్రైస్తవ మైనారిటీ పాఠశాలలకు ప్రత్యేక తేదీలు
Image Credit : Getty

క్రైస్తవ మైనారిటీ పాఠశాలలకు ప్రత్యేక తేదీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క్రైస్తవ మైనారిటీ విద్యాసంస్థలకు దసరా సెలవులు కొంత భిన్నంగా ఉన్నాయి. వీటికి సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మాత్రమే సెలవులు ఉంటాయి. ఈ ప్రత్యేక షెడ్యూల్ మైనారిటీ స్కూళ్ల విద్యార్థులు, సిబ్బందికి వర్తిస్తుంది. అయితే, త్వ‌ర‌లో వీటిలో కొద్దిగా మార్పులు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది.

35
తెలంగాణలో ద‌స‌రా సెలవులు ఎప్పుడు?
Image Credit : Asianet News

తెలంగాణలో ద‌స‌రా సెలవులు ఎప్పుడు?

తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవులు మరింత ఎక్కువ రోజులు ఉండ‌నున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ ప్రక‌టించిన వివ‌రాల ప్ర‌కారం.. ద‌స‌రా సెలవులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు ఉంటాయి. మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలు మూసివేయ‌నున్నారు. ఈ కాలంలో దసరా వేడుకలతో పాటు కుటుంబాలు త‌మ పిల్ల‌ల‌తో పర్యటనలు, సాంస్కృతిక కార్యక్రమాల‌ను ప్లాన్ చేసుకోవ‌చ్చు.

45
మిలాద్ ఉన్ నబీ కి పబ్లిక్ హాలిడే
Image Credit : unsplash

మిలాద్ ఉన్ నబీ కి పబ్లిక్ హాలిడే

తెలంగాణలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ఒక రోజు పబ్లిక్ హాలిడే ఉంటుంది. ఈ సెలవు దసరా బ్రేక్‌లో భాగం కాదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు ఆ రోజు మూత‌ప‌డ‌నున్నాయి. అంటే మ‌ధ్య‌లో ఒక రోజు త‌ప్పితే పిల్ల‌ల ద‌స‌రా సెల‌వులకు మ‌రో రోజు క‌లిసి రానుంది.

55
తల్లిదండ్రులు, విద్యార్థుల సెలవుల‌ను ప్లాన్ చేసుకోండి మ‌రి !
Image Credit : Getty

తల్లిదండ్రులు, విద్యార్థుల సెలవుల‌ను ప్లాన్ చేసుకోండి మ‌రి !

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు తేదీలకు దసరా సెలవులు ఉండటం వల్ల, కుటుంబాలు పర్యటనలు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రణాళికలను ముందుగా సిద్ధం చేసుకోవాలి. 

ఏపీలో చదివే విద్యార్థులు, తెలంగాణలో చదివే సోదరులు, స్నేహితులు వేర్వేరు తేదీల కారణంగా ఒకే సమయంలో హాలిడేలు పొందకపోవచ్చు. కాబట్టి షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు మార్చుకోవడంతో మీరు మంచి స‌మ‌యం గ‌డ‌ప‌వ‌చ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
విద్య
ప్రయాణం
హైదరాబాద్
పండుగలు
అమరావతి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మీరొస్తే మాకు పెద్ద పండగ సారూ..ఈ మహిళా స్పీచ్ కి పడిపడి నవ్విన పవన్ | Adavi Thallibata 2.0 Launch
Recommended image2
Now Playing
Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
Recommended image3
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్
Related Stories
Recommended image1
లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో
Recommended image2
నన్ను జట్టులోంచి తొలగించింది ధోనీనే : ఇర్ఫాన్ పఠాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved