నన్ను జట్టులోంచి తొలగించింది ధోనీనే : ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan: 2009 న్యూజిలాండ్ పర్యటనలో తనను జట్టులోంచి తప్పించడాని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కారణమని ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ధోనిపై చేసిన ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ధోనీ పై ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 న్యూజిలాండ్ పర్యటనలో తనను జట్టులోంచి తప్పించడానికి కారణం అప్పుడు కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోనీ తెలిపారు.
లల్లన్‌టాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. గ్యారీ కిర్‌స్టన్‌తో జరిగిన సంభాషణ ద్వారానే ఈ విషయం తనకు తెలిసిందని అన్నారు.
KNOW
2020లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్
అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టిన ఇర్పాన్ పఠాన్ 2008లో భారత టెస్ట్ జట్టులోంచి అవుట్ అయ్యారు. అదే ఏడాది చివర్లో వన్డే జట్టులోనూ చోటు కోల్పోయారు. 2012లో తిరిగి వన్డే జట్టులోకి వచ్చారు.
అప్పుడు 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు జట్టులో స్థిరపడడంతో మళ్లీ అవకాశాలు లభించలేదు. దీంతో 2020లో ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
శ్రీలంక మ్యాచ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన పఠాన్
2009 న్యూజిలాండ్ పర్యటనకు ముందు శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 60 పరుగులు చేసి, తన అన్న యూసుఫ్ పఠాన్‌తో కలిసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశారు. "ఆ సమయంలో నా స్థానంలో ఎవరైనా ఉన్నా, కనీసం ఏడాది పాటు జట్టులో ఉంటారని అనుకున్నాను. కానీ న్యూజిలాండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా నేను ఆడలేదు" అని అన్నారు.
గ్యారీ కిర్‌స్టన్ ను ఆడిగితే ఏం చెప్పారు?
"ఎందుకు నాకు అవకాశం ఇవ్వలేదని గ్యారీ కిర్‌స్టన్‌ను అడిగాను. మొదటి సమాధానం.. కొన్ని విషయాలు తన నియంత్రణలో లేవని చెప్పారు. ఎవరి చేతిలో ఉన్నాయో అడిగితే సమాధానం ఇవ్వలేదు. కానీ నాకు తెలిసింది.. అది ధోనీ చేతిలోనే ఉంది. ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక కెప్టెన్ చేతిలో ఉంటుంది. అదే కెప్టెన్ అధికారం" అని ఇర్ఫాన్ పఠాన్ వివరించారు.
ఆల్‌రౌండర్ ఎంపికపై ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నారు?
గ్యారీ కిర్‌స్టన్ చెప్పిన రెండో కారణం.. ఆ సమయంలో జట్టుకు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అవసరం. "యూసుఫ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్, నేను బౌలింగ్ ఆల్‌రౌండర్. నేటి కాలంలో అయితే రెండు రకాల ఆల్‌రౌండర్లను జట్టులో ఉంచేవారు" అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ఈ విషయం చెప్పిన తర్వాత ధోనీపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని కూడా స్పష్టం చేశారు.