MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో

లడ్డూ వివాదం తర్వాత తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్.. వివ‌రాలు ఇవిగో

Food Testing Lab in Tirumala: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం రూ.86 కోట్లతో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలలో భారీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 15 2025, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిరుమల లడ్డూ వివాదం.. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్
Image Credit : Getty

తిరుమల లడ్డూ వివాదం.. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్

2024 ఏప్రిల్‌లో తిరుమలలోని ప్రసాదం తయారీలో ఉపయోగించిన ప‌దార్థాల్లో కల్తీ నెయ్యి కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. భక్తుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటన తర్వాత భక్తుల్లో విశ్వాసం దెబ్బతింది. అప్పటి ప్రభుత్వంపై నిర్లక్ష్యం ఆరోపణలు వచ్చాయి.

దీనికి పరిష్కారంగా, ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ల్యాబ్ ద్వారా ప్రసాదం, అన్నప్రసాదం, టీ, పాలు, నెయ్యి వంటి పదార్థాలు క్రమం తప్పకుండా పరీక్షించనున్నారు. వ‌చ్చె నెల తిరుమ‌ల‌లో ఈ ల్యాబ్ ప్రారంభం కానుంది.

DID YOU
KNOW
?
తిరుపతి లడ్డూ
తిరుమల లడ్డూ 1740లలో ప్రారంభమై, 1933లో TTD ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రసాదంగా మారింది. నేడు రోజుకు లక్షల లడ్డూలు తయారవుతున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు
Image Credit : Andhra Pradesh Health Department

ఏపీలో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తాజాగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వివ‌రాలు వెల్ల‌డించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.86 కోట్ల వ్యయంతో 5 రాష్ట్రస్థాయి ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ.20 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఈ ల్యాబ్‌లలో ఆధునిక పరికరాల సాయంతో ఆహార పదార్థాల నమూనాలు పరీక్షిస్తారని వివరించారు.

35
తుదిదశకు తిరుమలలో ప్రత్యేక రాష్ట్ర స్థాయి ల్యాబ్ పనులు
Image Credit : Andhra Pradesh Health Department

తుదిదశకు తిరుమలలో ప్రత్యేక రాష్ట్ర స్థాయి ల్యాబ్ పనులు

తిరుమలలో భక్తుల కోసం ప్రత్యేక రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏప్రిల్‌లో ప్రారంభమైన పనులు తుదిదశకు చేరుకున్నాయి. వచ్చే నెలాఖరుకల్లా వినియోగానికి సిద్ధం చేయాలని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి ఘటన భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఆ నేపథ్యంలో ఈ ల్యాబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

45
ల్యాబ్ సదుపాయాలు ఏమిటి?
Image Credit : Andhra Pradesh Health Department

ల్యాబ్ సదుపాయాలు ఏమిటి?

తిరుమల పిండి మిల్లు సమీపంలోని 12,000 చదరపు అడుగుల భవనాన్ని ల్యాబ్‌గా మారుస్తున్నారు. రూ.19 కోట్ల వ్యయంతో అత్యాధునిక యంత్ర పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ల్యాబ్‌లో అన్ని రకాల ఆహార పదార్థాల నమూనాలు 24 గంటలు పరీక్షిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు.

55
విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలుల‌లో ల్యాబ్ లు
Image Credit : Andhra Pradesh Health Department

విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలుల‌లో ల్యాబ్ లు

విశాఖపట్నంలోని రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబొరేటరీ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. గుంటూరు జీజీహెచ్, తిరుపతిలో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌లు ఏర్పాటుకు పనులు కొనసాగుతున్నాయి. కర్నూలులో ఉన్న ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్‌ను ఉన్న అధునీకరించేందుకు కొత్త భవనం నిర్మించనున్నారు. భవనం కోసం స్థల ఎంపిక జరుగుతోంది.

ఒంగోలు, ఏలూరు ల్యాబ్‌ల ఆధునీకరణ

ఒంగోలు, ఏలూరులోని పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను రూ.13 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నారు. అత్యాధునిక పరికరాల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి పర్చేజింగ్ ఆర్డర్ జారీ చేశారు. దీంతో త్వరలో ఈ ల్యాబ్‌లు కూడా మెరుగైన సదుపాయాలతో పనిచేయనున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
ఆహారం
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
అమరావతి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
Recommended image2
రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Recommended image3
Now Playing
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu
Related Stories
Recommended image1
భారత్‌కు వస్తున్న మెస్సీ.. మోడీతో భేటీ
Recommended image2
గిల్ vs సూర్య‌: ఆసియా కప్ 2025లో టీమిండియా కెప్టెన్ ఎవ‌రు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved