- Home
- Andhra Pradesh
- APPSC Group 1 mains results: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
APPSC Group 1 mains results: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?
APPSC Group 1 mains results: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేయగా, ఇంటర్వ్యూలు తేదీలను కూడా ఏపీపీఎస్సీ వెల్లడించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
APPSC Group 1 mains results: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ మెయిన్స్ ఫలితాల ప్రకారం.. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల పూర్తి జాబితా కమిషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచారు.
మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 4,000 మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. నెలరోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయడం గమనార్హం.
అభ్యర్థులు తమ ఫలితాలను చూసేందుకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే, కమిషన్ హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చు.
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు.. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు ఫలితాల ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు (ఇంటర్వ్యూలకు) ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను APPSC అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్‌తో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కమిషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఎంపికైన అభ్యర్థులకు ఇ-మెయిల్, SMS ద్వారా సమాచారాన్ని పంపించనున్నారు.
ఏపీ గ్రూప్-1 ఇంటర్వ్యూల షెడ్యూల్
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలతో పాటు ఇంటర్వ్యూల తేదీల వివరాలు కూడా వెల్లడించారు. ఇంటర్వ్యూలు జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జూన్ 17న జరుగుతుంది. ధృవీకరణ అనంతరం వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు: పారదర్శక మూల్యాంకనం
ఏపీపీఎస్సీ వర్గాల ప్రకారం, మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిగా సీసీ కెమెరాల మధ్యలో చేసినట్టు తెలిపారు. పారదర్శకంగా ఇది జరిగిందని తెలిపింది. హడావుడి లేకుండా నిబంధనల మేరకు ప్రతి దశ కూడా ఖచ్చితంగా అమలైందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఏపీ గ్రూప్-1 నోటిఫికేషన్ నేపథ్యం
2023 డిసెంబరులో 89 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా, 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అభ్యర్థుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకొని మెయిన్స్ మే 3 నుంచి 9 వరకు సమగ్ర ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహించారు. 4, 496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రాలు
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం పట్టణాల్లో మొత్తం 13 పరీక్షా కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఎంపికైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు సిద్ధమవ్వాలని కమిషన్ సూచించింది.
గ్రూప్-1 ఉద్యోగాల కల సాధించాలనుకున్న అభ్యర్థులకు ఇది కీలక దశ. ఎంపికైన అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంట్లతో ఇంటర్వ్యూకు హాజరయ్యే విధంగా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.