- Home
- Andhra Pradesh
- Free Bus: సూపర్ గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus: సూపర్ గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం
Free Bus Travel: ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బంపరాఫర్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించనుంది. 5 రకాల ఏపీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు స్పష్టం చేశారు. ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకే పరిమితం కాదు
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు ప్రయాణం పథకం కేవలం జిల్లాల స్థాయికి పరిమితం కాబోతుందనే వార్తలు వచ్చాయి. సీఎం చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం ఇచ్చాయి. అయితే తాజా ప్రకటనలో మంత్రి అచ్చెన్నాయుడు దీనిపై స్పష్టతను ఇచ్చారు.
"ఈ పథకం ఏ ఒక్క జిల్లాకే పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుంది" అని మంత్రి పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్‌తో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించినట్లు కూడా వెల్లడించారు.
ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఈ పథకం కింద ఏపీ ఆర్టీసీ నడిపే ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. కాగా, వీటిలో పల్లెవేలుగు, సిటీ బస్సులు, ఎక్స్‌ప్రెస్ లు ఉన్నాయని సమాచారం. అలాగే, పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం అన్నవరంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్య ప్రభ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‛సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు,ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నాను.
తొలుత శంఖవరం మండలం, కత్తిపూడి… pic.twitter.com/HW1ZKSVuOb— Kinjarapu Atchannaidu (@katchannaidu) July 26, 2025
ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినకూడదని భావించిన ప్రభుత్వం, వారికి ఆగస్టు 15న ప్రత్యేక ఆర్థిక సాయం అందించనుంది. దీనివల్ల ప్రయాణ దూరాలను బట్టి ఆటో డ్రైవర్ల ఆదాయంపై ప్రభావం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
అన్నదాతలు, వితంతువులకు భరోసా
ఇతర సంక్షేమ పథకాలను కూడా అదే రోజున ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆగస్టు 2, 3 తేదీల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన వితంతువులకు ఆగస్టు 1న పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
ఇదిలావుండగా, జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబుమీద నమ్మకంతో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. జగన్ రెడ్డి భూతం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ రెడ్డి ఓ భూతం #FekuJagan
భూతాన్ని చూసి పెట్టుబడులు పరార్
సీఎం చంద్రబాబు గారి మీద నమ్మకంతో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి!#FirstStepRebuildingAP#ChandrababuNaidupic.twitter.com/mLy6W3e4lq— Kinjarapu Atchannaidu (@katchannaidu) July 26, 2025