MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Tourism : దేశమే ఏపీకి క్యూ కడుతుందా..? అంతలా ఏం జరగబోతోందో తెలుసా..?

AP Tourism : దేశమే ఏపీకి క్యూ కడుతుందా..? అంతలా ఏం జరగబోతోందో తెలుసా..?

Andhra Pradesh Tourism : ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకానికి మరింత బూస్ట్ ఇచ్చేలా బడ్జెట్ 2026 లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఈ హామీలతో యావత్ దేశం ఏపీవైపు చూస్తోంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 01 2026, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏపీ టూరిజంకు మహర్దశ
Image Credit : gemini

ఏపీ టూరిజంకు మహర్దశ

Andhra Pradesh Tourism : ప్రకృతి అందాలతో నిండిన ఆంధ్ర ప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి గురించి బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ప్రకటన చేశారు. ముఖ్యంగా అరకు, పులికాట్ ప్రాంతాల్లో ఎకో టూరిజంను డెవలప్ చేయనున్నట్లు వెల్లడించారు.

కేంద్ర బడ్జెట్ 2026 లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా పేరు పెట్టి నిధులు కేటాయించిన ప్రాజెక్టులు ప్రకటించలేదు. కానీ పర్యాటకం, తీర ప్రాంత అభివృద్ధి, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి రంగాల్లో తీసుకున్న జాతీయ స్థాయి నిర్ణయాలు అరకు, పులికాట్, రాష్ట్ర ఖనిజ కారిడార్ ప్రాంతాలకు కీలకంగా మారనున్నాయి.

24
అరకు డెవలప్ మెంట్...
Image Credit : Getty

అరకు డెవలప్ మెంట్...

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని అరకు ప్రాంతం పర్యాటకంగా బాగా డెవలప్ అయ్యింది. దీన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్రం సిద్దమయ్యింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ ప్లాన్ సిద్దంచేయగా ఇందులో అరకుకు చోటు కల్పించింది. అరకుతో సహా మొత్తం 20 టూరిజం ప్రాంతాలను డెవలప్ చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అరకులో ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మౌంటెన్ ట్రైల్స్, నేచర్ ట్రైల్స్ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కొండ ప్రాంతాలతో కూడిన అరకు ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది... కాబట్టి అందుకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు. ఇలా ఏజెన్సీ ప్రాంతం అరకును యావత్ దేశప్రజలకు పరిచయం చేస్తూ డెవలప్మెంట్ ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్.

ఇక 10,000 మంది పర్యాటక గైడ్‌లకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే అరకు ప్రాంతంలోనే యువతకు ఈ విధంగా ఉపాధి లభించనుంది. ఇక పర్యాటకులు పెరిగితే ఈ ప్రాంతాల్లోని గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుంది. హోమ్‌స్టేలు, గైడింగ్, ట్రాన్స్‌పోర్ట్ రంగాల్లో ఉద్యోగాలు పెరగడానికి కేంద్రం నిర్ణయాలు దోహదపడతాయి.

Related Articles

Related image1
Employment Opportunities : యువతకు బంపరాఫర్ .. ఈ రంగంలో ఇక లక్షలాది ఉద్యోగాలు
Related image2
Union Budget: కొత్త బ‌డ్జెట్‌తో దేశంలో ఏం మార‌నుంది.? 2026 బ‌డ్జెట్ హైలైట్స్ ఇవే
34
పులికాట్ డెవలప్మెంట్
Image Credit : ANI

పులికాట్ డెవలప్మెంట్

తీర ప్రాంత పర్యాటకం, పర్యావరణ ఆధారిత అభివృద్ధికి కేంద్రం సిద్దమయ్యింది. ఇందులో భాగంగానే పులికాట్ వద్ద ఎకలాజికల్ టూరిజం అభివృద్ధి సిద్దమయ్యింది. బర్డ్ వాచింగ్ ట్రైల్స్, ప్రకృతి ఆధారిత టూరిజం ప్రాజెక్టులు సిద్దం చేస్తోంది. దీంతో పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ పర్యావరణానికి అనుకూలమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది.

44
ఏపీకి రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్
Image Credit : Getty

ఏపీకి రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్

ఇది ఖనిజ ఆధారిత పరిశ్రమలకు బూస్ట్ ఇస్తుంది. రేర్ ఎర్త్ మినరల్స్‌పై రీసెర్చ్, మైనింగ్, ప్రాసెసింగ్, మాన్యుఫాక్చరింగ్ అవకాశాలు కల్పిస్తుంది. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది... ఇది కూడా ఏపీకి లాభంగా మారనుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
కేంద్ర బడ్జెట్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image2
ఈ రాయలసీమ జిల్లాలో అమరావతి స్థాయి రియల్ బూమ్.. భూములకు రెక్కలురావడం ఖాయం
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Related Stories
Recommended image1
Employment Opportunities : యువతకు బంపరాఫర్ .. ఈ రంగంలో ఇక లక్షలాది ఉద్యోగాలు
Recommended image2
Union Budget: కొత్త బ‌డ్జెట్‌తో దేశంలో ఏం మార‌నుంది.? 2026 బ‌డ్జెట్ హైలైట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved