MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Visakhapatnam: బాబోయ్.. నడి సముద్రంలో 11 అంతస్తుల మేడ.. 3 రోజులు ఎంజాయ్ చేసే ఛాన్స్.. కార్డేలియా క్రూయిజ్ వచ్చేస్తోంది !

Visakhapatnam: బాబోయ్.. నడి సముద్రంలో 11 అంతస్తుల మేడ.. 3 రోజులు ఎంజాయ్ చేసే ఛాన్స్.. కార్డేలియా క్రూయిజ్ వచ్చేస్తోంది !

Visakhapatnam Cordelia Cruise : విశాఖపట్నం నుంచి జూన్ 22 నుండి కార్డేలియా క్రూయిజ్ విహార యాత్రలు ప్రారంభం కానున్నాయి. 3 రాత్రుల లగ్జరీ ప్రయాణానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్, ధరల వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 10 2026, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వైజాగ్ వీకెండ్ వైబ్స్ మార్చేయడానికి లగ్జరీ నౌక వచ్చేస్తోంది !
Image Credit : Gemini

వైజాగ్ వీకెండ్ వైబ్స్ మార్చేయడానికి లగ్జరీ నౌక వచ్చేస్తోంది !

రోజువారీ ఆఫీస్ టెన్షన్లు, రొటీన్ లైఫ్ బోర్ కొట్టేసిందా? ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి ఎటైనా లాంగ్ ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి విలాసవంతమైన లగ్జరీ నౌక 'కార్డేలియా క్రూయిజ్' (Cordelia Cruise) మళ్లీ మన విశాఖపట్నం సముద్ర తీరానికి వచ్చేస్తోంది. సముద్రం మధ్యలో మూడు రాత్రులు గడుపుతూ, ఎంజాయ్ చేయాలనుకునే టూరిస్టుల కోసం సరికొత్త షెడ్యూల్ రెడీ అయిపోయింది. ఈ క్రూయిజ్ టూర్ విశేషాలు, రూట్ల వివరాలు, అసలు టికెట్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూన్ 22 నుంచే సముద్ర విహారం.. షెడ్యూల్ ఇదే
Image Credit : our own

జూన్ 22 నుంచే సముద్ర విహారం.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరమ్ ప్రెసిడెంట్ కె. విజయ్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కార్డేలియా క్రూయిజ్ తన ఈస్ట్ కోస్ట్ జర్నీని జూన్ 22 నుండి ప్రారంభించనుంది. ఈ విహార యాత్రలు జూలై 15వ తేదీ వరకు టూరిస్టులకు అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్‌లో విశాఖపట్నం నుండి చెన్నైకి నాలుగు సార్లు, అలాగే చెన్నై నుండి విశాఖపట్నానికి నాలుగు సార్లు ఈ భారీ నౌక ప్రయాణిస్తుంది. సాధారణంగా ఈ టూర్ ప్యాకేజీలు 3 రాత్రులు 4 రోజులు కాలపరిమితితో సాగుతాయి. అయితే పర్యాటకుల ఇష్టాన్ని బట్టి చెన్నై టు వైజాగ్ 2 రాత్రుల వన్ వే ట్రిప్, వైజాగ్ టు చెన్నై (పుదుచ్చేరి మీదుగా) 3 రాత్రుల వన్ వే ట్రిప్ లేదా ఈ రెండు పోర్టులను కలుపుతూ 5 రాత్రుల రౌండ్ ట్రిప్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

Related Articles

Related image1
FIFA World Cup 2026 Prize Money: గెలవకుండా ఇంటికెళ్లే టీమ్‌కు రూ. 100 కోట్లా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Related image2
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
35
11 అంతస్తుల సముద్రపు కోట.. లోపల అంతా క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్
Image Credit : X@worldbitwave

11 అంతస్తుల సముద్రపు కోట.. లోపల అంతా క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్

కార్డేలియా ఎంప్రెస్ (Cordelia Empress) అనే ఈ లగ్జరీ షిప్ పొడవు 692 అడుగులు కాగా, దీని బరువు 48,563 టన్నులు. ఈ భారీ నౌకలో మొత్తం 11 అంతస్తులు ఉంటాయి. ఇందులో ఏకంగా 796 క్యాబిన్లు ఉన్నాయి. ఒకేసారి 1,592 మంది నుండి 1,950 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. విశాఖ నుండి బయల్దేరి పుదుచ్చేరి మీదుగా చెన్నై చేరుకునే ఈ 36 గంటల సాగర ప్రయాణంలో వినోదానికి అసలు కొదవే లేదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థియేటర్లు, అదిరిపోయే కామెడీ షోల కోసం ప్రత్యేక ఆడిటోరియం, లైవ్ మ్యూజిక్ ఈవెంట్లు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్.

45
క్యాసినో నుండి కిడ్స్ అకాడమీ దాకా.. అన్నీ ఇక్కడే
Image Credit : X/MissionAndhra

క్యాసినో నుండి కిడ్స్ అకాడమీ దాకా.. అన్నీ ఇక్కడే

ఈ క్రూయిజ్‌లో కేవలం పెద్దలకే కాదు, పిల్లల కోసం 'కార్డేలియా కిడ్స్ అకాడమీ' ప్రత్యేకంగా ఉంది. హెల్త్ కాన్షియస్ ఉన్నవారి కోసం మోడ్రన్ జిమ్, ఎండలో సేదతీరడానికి స్విమ్మింగ్ పూల్, సాహసాలు ఇష్టపడే వారి కోసం రాక్ క్లైంబింగ్ వాల్, లక్ చెక్ చేసుకోవడానికి క్యాసినో, స్పా సౌకర్యాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, నౌకలో 4 విలాసవంతమైన డైనింగ్ హాల్స్, 9 బార్ అండ్ లాంజ్‌లు, 24 గంటల పాటు అందుబాటులో ఉండే సూపర్ మార్కెట్, ప్రపంచ స్థాయి వంటకాలతో కూడిన రెస్టారెంట్లు ప్రయాణికులకు సరికొత్త రాయల్ ఫీలింగ్‌ను ఇస్తాయి.

55
బడ్జెట్ ఫ్రెండ్లీ నుండి అల్ట్రా లగ్జరీ వరకు.. టికెట్ ధరల వివరాలు
Image Credit : x/DealsDhamaka

బడ్జెట్ ఫ్రెండ్లీ నుండి అల్ట్రా లగ్జరీ వరకు.. టికెట్ ధరల వివరాలు

కార్డేలియా క్రూయిజ్‌లో మీరు ఎంచుకునే రూమ్ కేటగిరీని బట్టి టికెట్ ధరలు మారుతుంటాయి. నౌకలో మొత్తం 5 రకాల క్యాబిన్ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి.

• ఇంటీరియర్ క్యాబిన్: తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సాధారణంగా ఒక వ్యక్తికి ప్రారంభ ధర రూ. 22,000 నుండి రూ. 25,000 వరకు ఉంటుంది.

• ఓషన్ వ్యూ క్యాబిన్: రూమ్ కిటికీలో నుంచే అంతులేని సముద్ర అందాలను వీక్షించవచ్చు.

• బాల్కనీ, సూట్ రూమ్స్: అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ బాల్కనీ సౌకర్యంతో ఇవి ఉంటాయి. డిమాండ్‌ను బట్టి వీటి ధరలు రూ. 80,000 పైగా ఉంటాయి.

కార్డేలియా క్రూయిజ్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జుర్గెన్ బైలోమ్ మాట్లాడుతూ.. విశాఖపట్నం కేవలం ఒక పర్యాటక ప్రాంతంగానే కాకుండా, క్రూయిజ్ ప్రయాణాలకు ఒక ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ గ్రూప్స్‌కు ఈ జర్నీ ఒక మరువలేని జ్ఞాపకంగా నిలుస్తుంది. ఆసక్తి గలవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Rain Alert: భారీ వర్షాలు.. రెండో ప్రమాద హెచ్చరిక ప్ర‌క‌టించే అవ‌కాశం, ప్రజలకు కీలక సూచన
Recommended image2
Now Playing
భోగాపురం వేదికగా గిన్నిస్ రికార్డ్ | Dhimsa Dance at Bhogapuram Airport | Asianet News Telugu
Recommended image3
Now Playing
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. రెండున్నర గంటలపాటు భోగాపురంలో మోదీ | Asianet News Telugu
Related Stories
Recommended image1
FIFA World Cup 2026 Prize Money: గెలవకుండా ఇంటికెళ్లే టీమ్‌కు రూ. 100 కోట్లా? ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Recommended image2
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved